తండ్రి చనిపోయాడని వెళ్తే సెల్ ఫోన్ దొంగలించేసారిలా..!

Kothuru Ram Kumar

ప్రస్తుత సమాజంలో మానవత్వం అనే మాటకు చోటు లేకుండా పోతుంది. కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తి గా ఎంచుకుంటున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు చోరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సంఘటనే ఢిల్లీ జిటీబీ హాస్పటల్ లో చోటుచేసుకుంది. హిస్పిటల్ లో తండ్రి కరోనా తో చనిపోవడంతో మృతదేహాన్ని తీసుకోడానికి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి సెల్ ఫోన్ ను దొంగిలించారు మాయగాళ్ళ. ఆ స్టోరీ ఎంటో మీరే చూడండి...

 

 

తన తండ్రి మృతదేహాన్నికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని..తన కుటుంబసభ్యుల కోసం మాదీపూర్ నివాసి పంకజ్ కుమార్ క్యాబ్ ఏర్పాటు చేశాడు.గేటు నెంబర్ 6 బయట వేచి ఉన్నానని , తన స్నేహితుడితో మాట్లాడుతుండగా అదే సమయంలో బైక్ పై వచ్చిన వ్యక్తులు తన సెల్ ఫోన్ లాక్కొళ్లి పోయారని వాపోయాడు.అందులో తన స్నేహితుల ఫోన్ నెంబర్లు , తన తండ్రి ఆధార్ కార్డు , ఫొటోలు ఉన్నాయని , మృతదేహాన్ని అప్పగించే సమయంలో తనకు ఉపయోగపడేవని.. అది సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.సమీపంలో ఉన్న ఓ టీ అమ్మే వ్యక్తి తనకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడని, అతని పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు.

 

 

చివరకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసితండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు పంకజ్. కేసు నమోదు చేశామని , అనుమానితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ లను స్కానింగ్ చేస్తున్నామని డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ శర్మ వెల్లడించారు. తన తండ్రి రమేష్ కుమార్ పది రోజుల క్రితం అస్వస్థతకు గురైనట్లు , బలహీనంగా ఉండడం, ఆహారం తీసుకోకపోతుండడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లానని పంకజ్ వెల్లడించారు. జీటీబీ ఆసుపత్రికి తీసుకెళ్లన తర్వాత వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకిందని గుర్తించారన్నారు. తాను ఆఫ్రికల్ షోరూంలో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: