ఆ కంపెనీ బాటలో జియో... టారిఫ్ ప్లాన్లలో భారీ మార్పులు...?

Reddy P Rajasekhar

2016 సంవత్సరంలో ఉచిత కాల్స్, తక్కువ ధరకే ఎక్కువ డేటా లాంటి ఆఫర్లతో జియో టెలీకాం రంగంలోకి ప్రవేశించింది. జియో కంటే ముందు ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్, బీ.ఎస్.ఎన్.ఎల్ నెట్వర్క్ లకు కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉండేవారు. కానీ జియో రాకతో పరిస్థితి మారిపోయింది. కోట్ల సంఖ్యలో వినియోగదారులు జియో వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఇతర కంపెనీలు నష్టాల బాట పట్టాయి. 
 
అయితే గత సంవత్సరం వరకు వినియోగదారులకు తక్కువ రేట్లకే కాల్స్, డేటా ఇచ్చిన జియో ఉచిత వాయిస్ కాల్స్ ను ఎత్తివేస్తూ గతేడాది వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఆ తరువాత టారిఫ్ ప్లాన్లలో భారీ మార్పులు చేసింది. తాజాగా మరోసారి జియో టారిఫ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. కొన్ని కొత్త ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. మొదట్లో ఉచిత ఆఫర్లు ఇచ్చిన క్రమంగా టారిఫ్ ప్లాన్ల ధర్లను భారీగా పెంచుతోంది. 
 
గతంలో మినిమం బడ్జెట్ ప్లాన్ గా ఉన్న 98 రూపాయల ప్లాన్ ను జియో తీసివేసింది. ప్రస్తుతం జియోలో 129 రూపాయలు బడ్జెట్ ప్లాన్ గా ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఉండే ప్లాన్లలో ఈ ప్లాన్ ప్రస్తుతం బడ్జెట్ ప్లాన్ గా నిలుస్తోంది. మరోవైపు 999 రూపాయల ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. జియో క్రమంగా రేట్లను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
గతంలో కోకోకోలా కంపెనీ మొదట ఉచితంగా కూల్ డ్రింక్ ను పంపిణీ చేసి ఆ తరువాత క్రమంగా రేట్లు పెంచుతూ ఆ తరువాత ఎక్కువ రేటుతో కోకోకోలాను విక్రయించింది. జియో కూడా కోకోకోలా కంపెనీ తరహాలోనే క్రమంగా రేట్లు పెంచుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జియో ప్లాన్లలో భారీ మార్పులు చేస్తూ ఉన్నా ఇతర నెటవర్క్ ప్లాన్లతో పోలిస్తే జియో టారిఫ్ ప్లాన్లే తక్కువగా ఉండటం జియోకు ప్లస్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: