బిజెపిని పవన్ నమ్మించి దెబ్బకొట్టాడా ?

Vijaya
మిత్రపక్షమైన బిజెపిని జనసేన అధినేత పవన్ కల్యాన్ నమ్మించి దెబ్బ కొట్టాడా ? స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్ధులు చాలా చోట్ల టిడిపి నేతలతో కలిసి నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసేటపుడు, వేసిన తర్వాత కూడా టిడిపి నేతలతోనే కలిసిపోయి ఊరిగింపులు చేయటం గమనార్హం.

ఇక్కడ విచిత్రమేమిటంటే నామినేషన్లు వేసిన వారు, ఊరేగింపులో పాల్గొనే రెండు పార్టీల నేతలు కూడా రెండు పార్టీల గుర్తులుంటే కండువాలు కప్పుకోవటం. ఒకవైపు బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకుంటున్న జనసేన నేతలు అదే సమయంలో టిడిపితో కలిసి ఎలా నామినేషన్లు వేస్తారు ? పైగా టిడిపి, జనసేన నేతలకు బలమున్న ప్రాంతాల్లో ఒకళ్ళకు మరొకళ్ళు సహకరించకునేట్లుగా నామినేషన్లు వేసిన విషయంతో అర్ధమైపోతోంది. జడ్పిటిసి స్ధానాల్లో ఎక్కువగా టిడిపి నామినేషన్లు వేస్తే ఎంపిటిసి స్దానాల్లో జనసేన నేతలు నామినేషన్లు వేయటం గమనార్హం.

ఈ రెండు పార్టీల నేతల మధ్య అవగాహన  ఈ విధంగా ఉంటే కొన్ని చోట్ల టిడిపి, సిపిఐ నేతలతో జనసేన నేతలు చేతులు కలిపారు. ఏదో ఓ పద్దతిలో పొత్తులు పెట్టుకున్న ఈ మూడు పార్టీలు బాగానే ఉన్నాయి. మరి జనేసేనతో పొత్తు పెట్టుకున్న కమలంపార్టీ పరిస్ధితి ఏమైపోవాలి ? బహుశా ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్ దగ్గర సమాధానం ఉన్నట్లు లేదు.

 ఇంత బాహాటంగా టిడిపి, సిపిఐతో జనసేన నేతలు కలిసిపోయిన విషయం పవన్ దృష్టికి పోకుండానే ఉంటుందా ? వాళ్ళతో చేతులు కలిపే విషయంలో పవన్ ఆమోదం లేకుండానే ఉంటుందా ?  తాజా ఉదాహరణలతో అర్ధమవుతున్నదేమంటే పవన్ అనే వ్యక్తి ఎప్పటికైనా చంద్రబాబునాయుడు జేబులో మనిషే అని. ఎవరేమనుకున్నా పవన్ మాత్రం తాను నమ్ముకున్న చంద్రబాబు ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే పని చేస్తాడని అర్ధమైపోయింది. మరి తాజా డెవలప్మెంట్లపై పవన్ ఏమంటారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: