జ‌గ‌న్ ఎలా న‌డిచారు..ఎక్క‌డ మైలురాయి వేశాడు?

Pradhyumna
విప‌క్ష నేత‌గా..ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వినేందుకు పాద‌యాత్ర‌ను అస్త్రం చేసుకున్న వైఎస్ జ‌గ‌న్ త‌న యాత్ర‌లో ప‌లు మైలురాళ్లు దాటారు.
- 2017, నవంబరు 6న ఇడుపులపాయలో యాత్ర ప్రారంభం కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గొడిగనూరు వద్ద 100 కి.మీ, డోన్‌ నియోజకవర్గం ముద్దనూరులో 200 కి.మీ, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచిలో 300 కి.మీ మైలురాయి దాటారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లిలో 400 కి.మీ, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద 500 కి.మీ, కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద 600 కి.మీ యాత్ర పూర్తి చేశారు. 
- యాత్ర 46వ రోజు, 2018, జనవరి 2న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ., యాత్ర 58వ రోజు, 2018 జనవరి 10న గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లి వద్ద 800 కి.మీ., యాత్ర 67వ రోజు, 2018 జనవరి 21న శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి వద్ద 900 కి.మీ మైలురాయి దాటారు.  
---1000 కి.మీ---
యాత్ర 74వ రోజు, 2018 జనవరి 29న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం వద్ద జగ‌న్‌ తన పాదయాత్రలో 1000 కి.మీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా అక్కడ 25 అడుగుల విజయ సంకల్ప స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత యాత్ర 82వ రోజు, 2018 ఫిబ్రవరి 7న ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్‌ పేట మండలం కొలిమర్ల క్రాస్‌ రోడ్స్‌ వద్ద  1100 కి.మీ., యాత్ర 89వ రోజు, 2018 ఫిబ్రవరి 16న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలం రామకృష్ణాపురం వద్ద 1200 కి.మీ., యాత్ర 97వ రోజు, 2018 ఫిబ్రవరి 25న కనిగిరి నియోజకవర్గం, నందనమారెళ్ల వద్ద 1300 కి.మీ., యాత్ర 104వ రోజు, 2018, మార్చి 5న అద్దంకి నియోజకవర్గం నాగులపాడు వద్ద 1400 కి.మీ మైలురాయి దాటారు.
----1500 కి.మీ----
యాత్ర 112వ రోజు, 2018 మార్చి 14న గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం, ములుకుదురు వద్ద వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో 1500 కి.మీ పూర్తి చేశారు.
ఆ తర్వాత ఇదే జిల్లాలో యాత్ర 121వ రోజు, 2018, మార్చి 27న సత్తెనపల్లి నియోజకవర్గం, పలుదేవర్లపాడు వద్ద 1600 కి.మీ., యాత్ర 130వ రోజు, 2018, ఏప్రిల్‌ 7న తెనాలి నియోజకవర్గం, అదే మండలంలోని సుల్తానాబాద్‌ వద్ద 1700 కి.మీ., యాత్ర 139వ రోజు, 2018 ఏప్రిల్‌ 18న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, గణపవరం వద్ద 1800 కి.మీ., 148వ రోజు, 2018 ఏప్రిల్‌ 29న పామర్రు నియోజకవర్గం, తాడంకి వద్ద 1900 కి.మీ పూర్తి చేశారు. 
----- 2000 కి.మీ --
అనంతరం యాత్ర 161వ రోజు, 2018 మే 14న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్‌ మండలంలోని వెంకటాపురం వద్ద వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో 2000 కి.మీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన 40 అడుగుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. 
ఆ తర్వాత ఇదే జిల్లాలో 2018 మే 22వ తేదీ, యాత్ర 168వ రోజున ఉంగుటూరు నియోజకవర్గం, గణపవరం మండలంలోని పిప్పర వద్ద 2100 కి.మీ., మే 30వ తేదీ, యాత్ర 176వ రోజున నరసాపురం వద్ద 2200 కి.మీ., జూన్‌ 11వ తేదీ, యాత్ర 186వ రోజున కొవ్వూరు నియోజకవర్గం, అదే మండలంలోని నందమూరు క్రాస్‌ వద్ద 2300 కి.మీ., జూన్‌ 21వ తేదీ, యాత్ర 195వ రోజున తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం క్రాస్‌ వద్ద జననేత 2400 కి.మీ మైలురాయిని దాటారు.
---2500 కి.మీ---
యాత్ర 208వ రోజు, 2018 జూలై 8న తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, పసలపూడి వంతెన వద్ద 2500 కి.మీ., యాత్ర 222వ రోజు, 2018 జూలై 28న జగ్గంపేట వద్ద 2600 కి.మీ., యాత్ర 234వ రోజు, 2018, ఆగస్టు 11న తునిలో 2700 కి.మీ., విశాఖ జిల్లా యలమంచిలిలో యాత్ర 244వ రోజు, 2018 ఆగస్టు 24న 2800 కి.మీ., యాత్ర 255వ రోజు, 2018,సెప్టెంబరు 5న పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం, పెదనాయుడుపాలెం పాత రోడ్డు వద్ద 2900 కి.మీ మైలురాయిని జననేత దాటారు.
---3000 కి.మీ ---
ప్రజా సంకల్ప యాత్రలో 269వ రోజు, 2018 సెప్టెంబరు 24న విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద తన పాదయాత్రలో 3000 కి.మీ పూర్తి చేశారు. 
---3500 కి.మీ ప్రస్థానం---
ఆ తర్వాత టెక్కలి మండలంలోని రావివలస శివారులో వైయస్‌ జగన్‌  తన పాదయాత్రలో 3500 కి.మీ ప్రస్థానం చేరుకున్నారు. ఆ తర్వాత యాత్ర 341వ రోజు, 2019 జవనరి 9న ఇచ్ఛాపురం వద్ద సుదీర్ఘ పాదయాత్ర ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: