స్నేహపూర్వకంగా జగన్ అమిత్ షా భేటీ

Sirini Sita
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి అమిత్ షాతో మంగళవారం సమావేశం అవ్వడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్ షా, జగన్ వారిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీ తాజా పరిస్థితుల పై వివరించడం జరిగింది. రివర్స్ టెండరింగ్ ద్వారా తాము సాధించిన విజయాలను అమిత్ షాకు తెలియచేసారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్ షాకు జగన్ తెలిపారు.


హెడ్ వర్క్స్ - హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు - టన్నెల్ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు. ఇక ఏపీ ప్రజల ప్రధాన డిమాండ్ అయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారు. దీని పై స్పందించిన అమిత్ షా ఆచితూచి సీఎం జగన్ కు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై అమిత్ షా జగన్ అభినందించి అమితానందాన్ని వ్యక్తం చేశారని సమాచారం. పోలవరానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీనిచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఏపీకి కేంద్రం నుంచి వరాలు అందుతాయని తెలుస్తోంది. 


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరద జలాల తరలింపు తదితర అంశాలపై అమిత్ షాతో చర్చించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాల కింద రూ.2,100 కోట్ల నిధులు కేటాయించిన కానీ కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే నిధులు విడుదల అయ్యాయి అని  జగన్ గుర్తు చేయడం జరిగింది. ఏపీలో వెనుకబడిన జిల్లాల్లో ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తే, బుందేల్ ఖండ్, కలహండి ప్రాంతాలకు రూ.4000 ఇస్తున్నారని తెలియచేసారు.


ఇక  చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు పరిశ్రమలు ఏపీవైపు చూడాలంటే ప్రత్యేక హోదా కచ్చితంగా అవసరం అని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలంకు గోదావరి వరద జలాల తరలింపుపై అమిత్ షాతో జగన్ చర్చించారు.మొత్తానికి సీఎం జగన్, అమిత్ షా భేటి స్నేహ పూర్వక వాతావరణంలో జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: