భారతీయ సంస్కృతికి దర్పణం – దసరా పండుగ !!

K Prakesh

అమ్మవారికి శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు అమ్మవారికి ఇష్టమైన రోజులుగా చెపుతారు. అందువల్ల నే దుర్గాదేవిని జ్ఞానదాయనిగా, మోక్షదాయనిగా, విధ్యాప్రదాయినిగా భావిస్తూ ఈ తొమ్మిది రోజులు అమ్మకు పూజ చేస్తే సకల జయాలు కలుగుతాయని బ్రహ్మoడపురాణం చెపుతోంది. అమ్మవారి పూజలో అనేక అర్ధాలు ఉన్నాయి మనలోని అహంకారం, కామక్రోధాలు, మమకారాలు, జంతువులను బలిఇచ్చే హింసాది లక్షణాలను ‘దుం’ అని అంటారు ఆ లక్షణాలను తొలిగించుకోవడం కోసమే చేసే పూజ గా దుర్గాదేవి శరన్ననవరాత్రులను పేర్కొంటారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను విజయదశమిని ఒకే విధంగా చేసుకుంటారు. ఎవరు ఏ రకాలైన పూజా విధానాలు పాటించినా విజయదశమి రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించుకుని పూజ చేయడం మన సాంప్రదాయం. విజయదశమినాడు జమ్మిచెట్టును, పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని మన నమ్మకం. పండుగనాడు జమ్మి ఆకులను ఇంటికి తీసుకువచ్చి బంగారంలా దాచుకోవడం ఆనవాయితి.

తెలంగాణలో బతుకమ్మ పండుగగా, కోస్తా ప్రాంతంలో కనకదుర్గమ్మ వైభవంగా, ఉత్తరంధ్రా లో సిరిమానోత్సవంగా, రాయలసీమలో పన్నారపు బండ్లుగా రాజకీయాలకు అతీతంగా దసరా అన్నిచోట్ల సమైఖ్య గానాన్ని వినిపిస్తూనే ఉంటుంది. దసరా పండుగ కేవలం ఆంధ్రులకే కాదు, దేశమంతా పండుగే. రుచులు, ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు అన్నీ భిన్నంగా ఉన్నా నవరాత్రి వేడుకలలోని అర్ధం మాత్రం ఒక్కటే. విజయం అందించిన తియ్యదనాన్ని కులమతాలకతీతంగా అందరితోను పంచుకోమని దసరా పండుగ చెపుతుంది. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న పదికోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలలో ఒక మధురమైన పండుగ దసరా. ఈ దసరా అందరికీ ఆనందాలు కలుగచేసి మనందరికీ సకల విజయాలను కలుగచేయాలని కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: