బిగ్ బ్రేకింగ్‌: త‌ండ్రి, కొడుకులు ఇద్ద‌రూ వెనుకంజ‌

VUYYURU SUBHASH

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతోంది. అన్నింటికి మించి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పంలో రెండు రౌండ్లు ముగిసేస‌రికి ఆయ‌న వెనుకంజ‌లో ఉన్నారు. చంద్ర‌బాబు 300 ఓట్ల‌తో వెనుకంజ‌లో ఉంటే... ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పోటీ చేసిన మంగ‌ళ‌గిరిలోనూ టీడీపీ 500 ఓట్లు వెనుకంజ‌లో ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనకంజలో ఉన్నారు. విశాఖలోని గాజువాక, పశ్చిమగోదావరిలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులే ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే జనసేన రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ముమ్మడివరం, తెనాలి నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: