చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేఖ, భారతీయ జనతా పార్టీ వ్యతిరేఖ వర్గాలు-వారి వ్యతిరేఖ భావనను భారత దేశంపై ప్రతీకారాత్మకంగా చూపిస్తున్నారు. లేకుంటే భారత ప్రధానిని ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విచక్షణ మరచి జింపింగ్ కు భయపడుతున్నాడనటం దేశానికి సిగ్గుచేటు. అదే విషయాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్‌, రాహుల్ గాంధిపై నటుడు మాధవన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇద్దరూ కలిసి ఉన్న మీమ్‌ వీడియోను కాంగ్రెస్‌ నిన్న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఈవీడియోపై మాధవన్‌ స్పందించారు.


“ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలున్నప్పటికీ నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధాని. మీరు చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్నారు. ఈ వీడియోలో అలాగే చేశారు. కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ఇలాంటి పోస్టులు ఊహించలేదు” అని ట్వీట్‌ చేశారు. అయితే మాధవన్‌ ట్వీట్‌ కూడా వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

“ప్రధాని నరేంద్రమోదీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను చూసి ఆయన భయపడుతున్నారు” అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే కాంగ్రెస్‌ ఈ వీడియో ను అంతర్జాలంలో పోస్ట్‌ చేసింది. రాహుల్‌ గాంధి విమర్శలకు భాజపా కూడా దీటుగానే బదులిచ్చింది. 


తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా మసూద్‌ అజార్ అంశంపై కాంగ్రెస్‌ నేతలకు పరోక్షంగా చురకలంటించారు. కాంగ్రెస్‌ హయాంలో మసూద్‌ అజార్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు భారత్‌ ఒంటరిగా ఉందని అని ఈ విషయంలో తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు (చైనా తప్ప) మనకు ఇప్పుడు మద్దతి స్తున్నాయని అన్నారు.

ఆపరిస్థితి ఒక్కసారైనా కాంగ్రెస్ పాలనాకాలంలో జరగలేదు. అసలు ఉగ్రవాదానికి కారణభూతమైన కాశ్మీర్ విభజనకు "రాహుల్ గాంధి తండ్రి రాజీవ్ గాంధి గారి 
పితామహుడు భారత ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహౄ పిరికితనమే కారణమని దేశంలోని విఙ్జులు ఘోషిస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ వీడియోపై స్పందించింది. భారత్‌ ను ఇబ్బంది పెట్టేలా చైనా ప్రవర్తిస్తుంటే విచారం వ్యక్తం చేయాలి, గానీ ఇలా అపహాస్యం చేయడం ఏంటని ట్విటర్ ద్వారా ప్రశ్నించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: