"చంద్రబాబు రాజకీయనాయకుడు కాదు! రాజకీయ వ్యభిచారి" : పోసాని కృష్ణ మురళి

స్వార్థమే ఆయన జీవన పరమావధి. రోజుకో తీరు, పూటకో మాట మార్చే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రాజకీయవ్యభిచారి అని, ఇలాంటి రుగ్మత ఉన్న వ్యక్తిని టాలీవుడ్ ఎందుకు అనుసరించాలి? అని సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఊసరవెల్లికే రంగులు మార్చటం నేర్పగల ఈయనకు వ్యక్తిగత స్వార్థం కోసం రోజుకో మాట మార్చడం, రాజకీయ బ్రోకరిజం చేయడం వెన్నతో పెట్టినవిద్య అని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తికి చెందిన పార్టీ నేతలు టాలీవుడ్ లోని వారిని తప్పుపట్టడం దెయ్యాలు వేదాలువల్లించినట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. పోసాని తాజాగా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం  తీరును ఎండగట్టారు. 

పోసాని కృష్ణ మురళి చెప్పిన విషయాలు: 

"ప్రత్యేక హోదా మాటెత్తితే జైళ్లలో పెట్టాలంటూ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని లాఠీలతో చితక్కొట్టించారు. అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. ఇలా చేసిన మాబాబే ఇప్పుడు మళ్లీ  ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాలనడాన్ని ఏమనాలి? రాజకీయ బ్రోకరిజం అనాలా? వెధవాతి వెధవలు అనాలా? ఉద్యమంలోకి రాని టాలీవుడ్ వాళ్ళని తిడతారేమిటి? ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం ఏమిటి? చంద్రబాబు, టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్‌ లాంటి రాజకీయ బ్రోకర్లనునమ్మి టాలీవుడ్ జనం వెర్రివాళ్లలాగా ప్రత్యేక హోదా ఉద్యమం లోకి దూకాలా? ఏ విషయంలో మాట మీద నిలబడ్డారని ఆయన వెనుక నడవాలి?

జగన్‌ వైసిపి పార్టీ పెట్టుకుని రాష్ట్ర మంతా తిరిగి కష్టపడి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, వారిలో 23మందిని డబ్బుచ్చి ముఖ్యమంత్రైన చంద్రబాబు కొనుగోలు చేశారు. వారిని ఇంటికి తీసుకెళ్లి కండువాలు మార్చారు.  "వేరే పార్టీ టిక్కెట్‌పై గెలిచిన వారిని పదవులకు రాజీనామా చేయించకుండా తన పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు రాజకీయ బ్రోకర్‌ కాక మరేమవుతారు? సినిమా వాళ్లు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి బ్రోకరిజం చేయాలా? జగన్‌ అవినీతిపరుడు అని విమర్శిస్తున్న చంద్రబాబుకు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కనిపించలేదా? ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంకలో పెట్టుకుని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు? బాబు నీతిమంతుడైతే కేంద్రంతో మాట్లాడి సుజనా చౌదరికి ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు? సుజనా చౌదరికో నీతి? జగన్‌కో నీతా? బస్సుల్లో పడుకున్నానని చెప్పుకునే చంద్రబాబుకు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక విమానాలు ఎందుకు?"

"ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తానన్న ఆమరణదీక్షకు తాను మద్దతు ఇస్తానని సినీ నటుడు పోసాని తెలిపారు. అయితే ఆయన ఆమరణ దీక్షకు కూర్చోవాలని కోరు కోవడం లేదన్నారు. అసలు ఆయన ఎందుకు కూర్చోవాలి? అని ప్రశ్నించారు. దోచుకున్నవాళ్లు ఎందుకు కూర్చోరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష పేరుతో ఆయన్ను చంపడానికి ప్లాన్ చేశారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడా? మంత్రి అయ్యాడా? సీఎం అయ్యాడా? ఆయన్ను ప్రోత్సహించి, ఆమరణ దీక్షకు కూర్చోబెట్టి చంపినా చంపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. 

"ఐలవ్యూ నాన్నా... నువ్వు కూర్చోవద్దు"  అంటూ పవన్ కళ్యాణ్ న్ను వేడుకున్నారు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఈ వ్యాఖ్యలు చేశారు.

"ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడుతామని బాబు అంటున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎందాకో అక్కర్లేదు, విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో రాష్ట్రంలోని మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముఖ్యమంత్రితో కలిపి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోమనండి. ముస్లింలు రంజాన్‌ మాసంలో ఉపవాసం పాటించినట్లు 30రోజులు ఆమరణ దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమైతే తేదీ ప్రకటించమనండి నేను నా కుటుంబంతో కలసి ఆమరణ దీక్షలో కూర్చుంటాను. టాలీవుడ్ పరిశ్రమలోని వారిని కూడా అదే వేదికపై ఆమరణ దీక్షలో కూర్చోబెడతాను. 30రోజుల్లో ప్రధానమంత్రి నరెంద్ర మోదీ దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే 31వ రోజు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను" అని పోసాని కృష్ణమురళి ఉద్వేగభరితంగా తేల్చిచెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: