నేను టీవీ9ను బహిష్కరిస్తున్నాను..! ఇదో సోషల్ ఉద్యమం..!

Chakravarthi Kalyan
చాగంటి కోటేశ్వరరావు.. ప్రముఖ ప్రవచనకర్త. ఆధ్యాత్మికవేత్త. తెలుగు నేలపై అతి తక్కువ కాలంలో అందరి మన్ననలు అందుకున్న ప్రసంగికుడు. జీవిత సత్యాలను, పురాణ విశేషాలను వ్యక్తిత్వ వికాస సూత్రాలుగా మలచి ఆయన చెప్పే ప్రసంగాలు.. చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆయన ప్రవచనాలతో స్వాంతన పొందుతున్నారు. 



ఐతే.. ఇటీవల ఆయన ఓ ప్రవచనంలో.. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీవీ 9 ఓ కథనం ప్రసంగం చేసింది. ఇది సంచలనం సృష్టించింది. దీంతో యాదవ సంఘాలు చాగంటి కోటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇదో వివాదంగా మారి మరికొన్ని చానళ్లు కూడా ఈ ఇష్యూపై ఫోకస్ చేసి రచ్చ రచ్చ చేశాయి. 


దీంతో మనస్తాపం చెందిన చాగంటి కోటేశ్వరరావుగారు ఇకపై తాను ప్రవచనాలు చెప్పకూడదని నిర్ణయించుకున్నారట. ఈ వివాదంపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాగంటి అభిమానులు ఎక్కువగా ఉండటంతో వారు టీవీ 9 తీరుపై మండిపడుతున్నారు. టీవీ9 వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు.  



చాగంటి కోటేశ్వర రావు గారి జీవనాధారం ప్రవచనాలు కావని.. ఆయన ఏ ప్రవచనం దగ్గర డబ్బులు తీసుకోరని.. అలాంటి మంచి వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ9ను తాను బహిష్కరిస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాగంటి ప్రవచనాల్లో కొంత భాగాన్ని తీసుకుని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: