చాగంటికి ఆ పదవి.. అందుకే ఇచ్చారా..!?

Chakravarthi Kalyan
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావుగారి పేరు తెలియని వారు చాలా అరుదు. నాలుగైదేళ్ల నుంచి ఆయన పేరు మారుమోగిపోతోంది. ఆయన ప్రవచనాలు ప్రసారం చేయని టీవీ ఛానెల్ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. దాదాపు ప్రతి ఛానల్ ఏదో ఒక సమయంలో అరగంట సేపు ఆయన ప్రవచనాలు ప్రసారం చేసి తరిస్తున్నాయి. 

ఆకట్టుకునే మాట తీరు.. ధర్మసూక్ష్మాలను వివరించే పద్దతి.. ప్రముఖ ఆధ్యాత్మిక వాజ్ఞ్మయాన్నిఆయన ప్రస్తావించే తీరు ప్రేక్షకులకు అమిత ఆద్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నాయి. అప్పుడప్పుడూ మరీ సనాతన ధర్మాలు, మూఢ విశ్వాసాలను పెంపొందించేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నా.. చాలామందికి చాగంటి ప్రవచనాలు ఆకట్టుకుంటున్నాయి. 

అలాంటి చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రా ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రభుత్వ సలహాదారుగా ఉగాది వేళ ఆకస్మికంగా నియమించేసింది. ఉగాది రోజు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో చాగంటి ప్రసంగం విని ఉత్తేజితుడైన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఆయన్ను సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి అది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదట. 

గత ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లు బీజేపీతో ఫ్రెండ్ షిప్ కారణంగా టీడీపీకి పడ్డాయని.. కానీ తమకు ఏపీ సర్కారు ఏమీ చేయడం లేదన్న అసంతృప్తి బ్రాహ్మణుల్లో ఉందని చంద్రబాబుకు సమాచారం అందిందట. చంద్రబాబు ఇప్పటికే మీడియా సలహాదారుగా పరకాల ప్రభాకర్ కు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ కృష్ణారావుకు పదవులు కట్టబెట్టారు. 

బ్రాహ్మణులకు పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రావులపాటి సీతారామారావు తెలంగాణ వ్యక్తి అయినా పోలీస్ కార్పోరేషన్ ఛైర్మన్ గిరీ కట్టబెట్టారు. త్వరలో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ ఓటుబ్యాంకు కొల్లగొట్టేందుకే చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి కట్టబెట్టారట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: