టిక్ టాక్ పై.. మరో దేశం నిషేధం?

praveen
టిక్ టాక్.. ఈ షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ గురించి నెటిజెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు భారత్ లో  సెన్సేషన్ సృష్టించిన మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్ లో టిక్ టాక్ మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పాలి. ఇలా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే నేటిజన్స్ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకొని.. సరికొత్త ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఈ క్రమంలోనే కనీసం మనిషి తన తలను పక్కకు తిప్పుకునేందుకు కూడా వీలులేని విధంగా అందరిని టిక్ టాక్ బానిసలుగా మార్చుకుంది అని చెప్పాలి.

 ఒక రకంగా ఇండియాలో ఉన్న యువత దగ్గర నుంచి ముసలి వాళ్లు చిన్నపిల్లల వరకు అందరిని కూడా టిక్ టాక్ వినియోగదారులుగా మారిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత భద్రతా కారణాల దృశ్య ఇక భారత ప్రభుత్వం చైనా యాప్ అయినా టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే టిక్ టాక్ పై  భారత్ తర్వాత మరికొన్ని దేశాలు కూడా ఈ చైనా యాప్ నిషేధానికి  సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు  ఇక ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఇలాంటి నిర్ణయం వైపుగా అడుగులు వేస్తుంది అన్నది తెలుస్తోంది.

 ఏకంగా అమెరికాలో ఉన్న టిక్ టాక్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని టిక్ టాక్ దొంగలిస్తుందని ఇక అమెరికా వాసులపై నిఘా కోసమే చైనా ఈ యాప్ను తీసుకువచ్చింది అంటూ ఏకంగా ఎఫ్బిఐ ఇటీవలే తేల్చింది. ఈ క్రమంలోనే  టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు అమెరికా చట్టసభలో రంగం సిద్ధమవుతుంది. ఆ దేశంలోని రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లు ప్రకారం రష్యా చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్ మీడియా యాప్ పై అయినా సరే నిషేధం విధించేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: