వాడి పడేసిన టిష్యు పేపర్.. 6.37 లక్షలు.. ఎందుకంటే?

praveen
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.  ప్రపంచం నలుమూలల్లో జరిగిన వార్తలు కూడా ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు నేటి రోజుల్లో.  ఈ క్రమంలోనే ఇలా వెలుగులోకి వచ్చిన కొన్ని వార్తలు మాత్రం కొన్ని కొన్ని సార్లు విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది.

 సాధారణంగా వాడి పడేసిన టిష్యూ పేపర్ని డస్ట్ బిన్ లో వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు.  కానీ ఇలా వాడి పడేసిన టిష్యూ పేపర్ని కొనడానికి ఎవరైనా ఆసక్తి చూపుతారా అంటే అలాంటి పని ఎవరు చేయరు సమాధానం చెబుతారు అందరూ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక వ్యక్తి వాడి పడేసిన టిష్యూ పేపర్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు.. ఏకంగా 6. 36 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.  ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా  ఇది నిజంగానే జరిగింది.
 మహ్మద్ అబ్దు అనే వ్యక్తి సౌదీ అరేబియాకు చెందిన సింగర్. అతడికి గల్ఫ్ దేశాల్లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. అతను ఏదైనా షోలలో పాల్గొంటున్నాడు అంటే చాలు అక్కడికి ప్రేక్షకులు ఎగబడతారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం సౌదీలోని అబ్దు అభ నగరంలో ఏర్పాటు చేసిన షోలో పాల్గొన్నారు. ఈ సింగర్ ఎప్పటిలాగానే తన స్వరం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే అనంతరం ఒక టిష్యూ పేపర్ ను ఉపయోగించాడు.  ఇప్పుడు అది ఆన్లైన్లో అమ్మకానికి వచ్చింది. పేపర్ ను జాగ్రత్తగా భద్రపరిచి ఆన్లైన్లో 29,999 సౌదీ రియాల్ భారత కరెన్సీలో 6.3 లక్షలు గా నిర్ణయించారు. మొత్తం ఒకేసారి ఇవ్వాల్సిన  అవసరం లేదట. నాలుగు విడుతలలో  చెల్లించే వెసలుబాటు కల్పించారు. ఇది కాస్త  హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: