అయ్య బాబోయ్.. రూ.1000 కోట్ల వజ్రం దొరికింది?

praveen
అదృష్టం ఎప్పుడు ఎవరికి వరిస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది కోటీశ్వరులు కావాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు.. లేదా ఏకంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక మరికొన్ని సార్లు ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎంత ప్రయత్నించినప్పటికీ అటు అదృష్టం మాత్రం దరిచేరదు. కానీ కొంతమంది మాత్రం ఏమీ చేయకపోయినా అదృష్ట లక్ష్మి తలుపు తట్టి కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతూ ఉంటుంది.

 దీంతో ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారి పోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒక డైమండ్ బయటపడింది. ఇక ఈ డైమండ్ తో ఏకంగా వారి పంట పండింది అనే చెప్పాలి. సాధారణంగా డైమండ్ బయట పడిన సమయంలో ఒకటి లేదా రెండు కోట్ల రూపాయలు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా  బయటపడిన డైమండ్ కారణంగా వెయ్యి కోట్ల రూపాయలు సొంతం అయ్యింది అని చెప్పాలి.

 ఆస్ట్రేలియాకు చెందిన లుపాక అనే డైమండ్ కంపెనీ తవ్వకాలలో ఒక డైమండ్ గుర్తించింది. ఇది అచ్చమైన లేత గులాబీ రంగులో ఏకంగా 170 కేజీల బరువు ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గత మూడు వందల ఏళ్ల లోపు గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదే అని భావించింది సదరు కంపెనీ.  అయితే ఈ వజ్రానికి లులో రోజ్ అని పేరు కూడా పెట్టారు. ఇక ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సాన పెడితే 85 నుంచి 90 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ వజ్రం విలువ సుమారు 900 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: