చేపలు పడుతున్న వ్యక్తి.. ఇంతలో బీకర శబ్దం.. ఏంటా అని చూస్తే?

praveen
ఎంతోమందికి చేపలు పట్టడం అనేది ఒక సరదాగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఖాళీ సమయం దొరికిందంటే చాలు సరదాగా దగ్గరలో ఉన్న కొలనులో ఒక పడవ వేసుకుని వెళ్లి చేపలు పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేపలు పట్టడానికి వెళ్లిన ఎంతో మంది వ్యక్తులకు కొన్ని కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక హాయిగా ఒక కొలనులో పడవ తో వెళ్ళాడు ఒక వ్యక్తి. చేపలు పట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు.. ఇక కాసేపు సేద తీరుతూ చేపలు పడుతూ ఉన్నాడు సదరు వ్యక్తి.  ఇంతలో ఎక్కడి నుంచో బిగ్గరగా శబ్దాలు వినిపించాయి.

 దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో భీకరమైన శబ్దం విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సదరు వ్యక్తి. అంతలోనే ఏకంగా ముఖం నిండా రక్తంతో నీళ్లలో నుంచి  బయటకు వస్తూ కనిపించింది. ఇంకేముంది అతను ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యాడు అని చెప్పాలి. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో వెలుగులోకి వచ్చింది.  నది దగ్గర  సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన  వ్యక్తికి వింత శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఏమై ఉంటుందా అని భయంతో నలువైపుల వెతకడం ప్రారంభించాడు సదరు వ్యక్తి.

 ఇంతలో ముఖం నిండా రక్తంతో ఒక వ్యక్తి బయటకి రావడం గమనించాడు. దీంతో మరింత భయాందోళనకు గురి అయ్యాడు. అయితే ఇక ఆ స్విమ్మర్ బయటకు చేరుకోగానే అతని ముఖానికి తగిలిన గాయానికి పడవలో ఉన్న వ్యక్తి ఒడ్డుకు చేరుకుని  టవర్ కట్టాడు. ముందుగా అతడు ఏదైనా రాయి కొట్టుకుని ఉండవచ్చు లేదా ఏదైనా ముఖానికి బలంగా తగిలి ఉండవచ్చు అని భావించాడు. కానీ ఆ గాయాన్ని తీక్షణగా గమనించిన తర్వాత అది మొసలి దాడి ద్వారా జరిగింది అని అర్థమైంది  దీంతో తన దగ్గర ఉన్న మెడికల్ కిట్ ద్వారా ఫస్ట్ ఎయిడ్  చేశాడు. అంబులెన్స్ ను పిలిపించి అతని ఆసుపత్రికి తరలించాడు.ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: