శాడిస్టు ప్రియురాలు.. ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా యువతీ యువకులు మధ్య స్నేహం కుదరడం ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. ఇక ఆ తర్వాత అన్నీ సక్రమంగా జరిగితే ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక స్నేహితులుగా ఉన్నప్పటికంటే అటు ప్రేమికులుగా మారిన తర్వాత యువతీయువకులు మరింత మధురమైన జ్ఞాపకాలను పొందుతూ ఉంటారు. ప్రేమలో మునిగి తేలడం కంటే ఇంకా ఆనందం ఏముంటుంది అని సమాధానం చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రేమను తిరస్కరిస్తే శాడిస్ట్ లుగా మారి పోతూ ఉంటారు.

 ప్రేమను తిరస్కరించింది అన్న కారణంతో ఎంతోమంది ప్రేమోన్మాదులు దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనదేశంలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చ సంచలన గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని తెలుస్తోంది. ఇక ప్రేమను తిరస్కరించింది అన్న కారణంతో ఏకంగా బౌతిక దాడులకు పాల్పడటం లేదా మానసికంగా వేధించడం  చేస్తూ ఉంటారు ప్రేమోన్మాదులు. ఇక్కడ ఓ యువతి కూడా ఇలాంటిదే చేసింది.

 కొన్ని చోట్ల అబ్బాయిలు శాడిస్టిక్ గా మారితే కొన్ని చోట్ల అమ్మాయిలు శాడిస్టిక్ గా మారుతున్నారు. ఇక్కడ ఓ యువతి ప్రియుడి పైన శాడిజం చూపించింది. కైరా అనే యువతి ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది. అతను రిజెక్ట్ చేశాడూ. దీంతో కోపంతో రగిలి పోయింది. అతన్ని మానసికంగా వేధించాలని అనుకుంది. దీంతో బాయ్ ఫ్రెండ్  ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఇక కైరా హెచ్ఆర్ జాబ్స్ రిక్రూటర్  గా అతని  నెంబర్ కి కాల్ చేసింది. ఆ తర్వాత వివరాలు అని తెలుసుకుంది. తర్వాత కొన్ని రోజులపాటు వివిధ దశలలో ఇంటర్వ్యూ చేసింది. జాబ్  వచ్చేస్తుంది అన్న భరోసా కల్పించింది. చివరికి లగ్జరీ లైఫ్ అని చెప్పి అతనిలో ఆశలు పెంచింది. ఇక ఇలా ఎన్నో రోజుల పాటు మానసిక వేదనకు గురి చేశాక నువ్వు ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కాలేదు అని చెప్పి షాక్ ఇచ్చింది. ప్రియుడిపై పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్న యువత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: