ఓరినాయనో.. కరేబియన్ దీవుల్లో కరెంటు పోయింది?

praveen
మొన్నటివరకు బొగ్గు ద్వారా కరెంటును ఉత్పత్తి చేయడం లేదా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రపంచ దేశాలు విద్యుత్ ఉపయోగించాయి. కానీ ఇటీవల కాలంలో మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం సోలార్ పవర్ విండ్ పవర్ దిశగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇలాంటి కొత్త విధానం ద్వారా అటు కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు అని నమ్ముతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక ప్రపంచ దేశాలు మొత్తం విండ్ పవర్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచ దేశాలను మాత్రం విద్యుత్ సంక్షోభం చీకట్లోకి నెట్టే విధంగానే కనిపిస్తోంది. ఎందుకంటే విండ్ పవర్ పై  అత్యుత్సాహంతో బొగ్గు నిలువలను ఉత్పత్తి చేయడం దారుణంగా తగ్గించాయి ప్రపంచదేశాలు.

 తద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా పూర్తిగా బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి అనే చెప్పాలి. దీంతో కేవలం ఒక దేశంలో కాదు దాదాపు ప్రపంచ దేశాలు మొత్తం రానున్న రోజుల్లో తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన పోతున్నాయ్ అన్నది తెలుస్తుంది.  ఇక బొగ్గు కొరత కారణంగా ప్రస్తుతం ఒకేసారి రెండు వందల యాభై శాతం ధరలు పెరిగిపోవడం ప్రపంచాన్ని మొత్తం విద్యుత్ సంక్షోభం లోకి నెడుతుంది. అంతేకాదు ఇప్పుడు విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా మరో కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా చైనా మధ్య నెలకొన్న వివాదం కూడా విద్యుత్ సంక్షోభానికి కారణం గా మారిపోయింది.

 విద్యుత్ సంక్షోభం కారణంగా 1.5 మిలియన్ల ప్రజలు కరేబియన్ దీవుల్లో చీకట్లోకి వెళ్లిపోయారు అన్నది తెలుస్తుంది. బొగ్గు కొరత కారణంగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో కరేబియన్ దీవుల్లో ఇలా జరిగింది అనేది తెలుస్తుంది. దీంతో ఇక కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి కరెంట్ సబ్ స్టేషన్ లు మొత్తం పూర్తిగా ధ్వంసం అయ్యాయట. దీంతో ఇక అక్కడి ప్రజలందరూ చీకట్లోనే బ్రతకాల్సిన పరిస్థితి. అయితే మళ్లీ కరెంటు ఎప్పుడు పునరుద్ధరిస్తారు అన్న దానిపై మాత్రం చెప్పలేము అంటూ అక్కడి అధికారులు చెప్పడంతో ప్రస్తుతం ప్రజలందరూ చీకట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: