గడ్డం లేకపోతే ఉద్యోగానికి రావద్దు.. కొత్త రూల్?

praveen
ఆఫ్ఘనిస్థాన్లో ప్రజాస్వామ్య  బద్ధంగా సాగుతున్న పాలనను కాలరాస్తూ ఇక అటు తాలిబన్లు ఆయుధాల తో పాలన సాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమం లోనే ఆయుధాల తో ఎంతగానో మారణ హోమం సృష్టించి చివరికి ఆఫ్ఘనిస్తాన్ ని స్వాధీనం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రజలందరికీ స్వేచ్ఛా యుత పాలన అందించేందుకు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ తాలిబన్లు ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పారు.

 ఇక ప్రపంచ దేశాలను నమ్మించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తర్వాత తాలిబన్లు వారి అసలు రంగు బయట పెడుతూ ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యం గా తాలిబన్ల  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందు వరకు ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణం లో జీవించిన మహిళలను కేవలం వంట ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే ఒక కీలు బొమ్మలను చేసేసారు. దీంతో  ఎంతో మంది మహిళలు ప్రస్తుతం తాలిబన్ల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే మొదట మహిళలు హైస్కూల్ వరకు చదువుకునేందుకు అవకాశం ఇచ్చిన తాలిబన్లు.. ఇక ఇప్పుడు మహిళలకు  చదువులు వద్దు అంటూ తేల్చి చెప్పేశారు.

 ఇక ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు మరో విచిత్రమైన కొత్త రూల్ తీసుకు వచ్చారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. తమ దేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం గడ్డం పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా గడ్డం పెంచుకుంటేనే ఉద్యోగాలకు అనుమతిస్థాము అంటూ కొత్త రూల్ తీసుకువచ్చారు. అంతే కాకుండా విదేశీ వస్త్రాలు ధరించి కూడదని.. ఇక స్థానికం గా దొరికే లూ చొక్కా ప్యాంటు తలపాగా ధరించి గడ్డం పెంచుకుని ఆఫీస్ లకి రావాలని తాలిబన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: