రోడ్లపై గోడలు కడుతున్నారు.. ఎందుకో తెలుసా?

praveen
ఇటీవలే పాశ్చాత్య దేశంగా కొనసాగుతున్న కెనడాలో వెలుగులోకి వచ్చిన ఒక సమస్య ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా సమయంలో అన్ని దేశాల్లో కూడా తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు నిబంధనలు పెట్టాయ్. వ్యాక్సిన్ వేసుకోకుండా  నిర్లక్ష్యంగా ఉన్న వారికి అవగాహన కల్పిస్తూ మరి వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ సూచిస్తున్నాయ్. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ తప్పనిసరి అనే నిబంధన కూడా కొనసాగుతోంది. ఇక ఇదే ఇటీవల కెనేడా ప్రభుత్వం అక్కడ అమలులోకి తీసుకు వచ్చింది. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.

 ఇతర దేశాల నుంచి కెనడా లోకి వచ్చే ట్రక్ డ్రైవర్ లు అందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ చేసుకోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనతో ఎంతో మంది ట్రక్ డ్రైవర్లు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే ఏకంగా అక్కడ ఉన్న రహదారులు అన్నింటినీ ట్రక్ లతో మూసి వేస్తూ ప్రస్తుతం ఉద్యమం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఏకంగా ఉద్యమకారులకు భయపడి కెనడా ప్రధాని ట్రూడో అధికారిక కార్యాలయం నుంచి  అజ్ఞాతంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 అయితే ఇక ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ తీసుకొచ్చిన నిబంధనపై ఉద్యమాలు చేపడుతున్న ఎంతోమంది ఇక ఇప్పుడు మరింత రెచ్చి పోతున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ రహదారుల పై ట్రక్కులు పెట్టి బ్లాక్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా రహదారుల పైన గోడల నిర్మాణం కూడా చేపడుతున్నారూ. ఇంత జరుగుతున్నా ఉద్యమ కారుల భయం తో అజ్ఞాతం  లోకి వెళ్లిపోయిన ప్రధానమంత్రి మాత్రం ఈ విషయంపై స్పందించక  పోవడం గమనార్హం. ఈ క్రమం లోనే ఇక కెనడాలో ప్రారంభమైన ఈ ఉద్యమం రానున్న రోజుల్లో ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: