ప్లీజ్.. మా దేశానికి రండి.. వేడుకుంటున్న పాక్?

praveen
కొన్ని దశాబ్దాల నుంచి ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్న పాకిస్తాన్ దేశ ప్రజల ప్రయోజనాలను కూడా గాలికొదిలేసింది. కనీసం దేశంలో అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న విషయాలను కూడా పట్టించుకోలేదు. కేవలం ఉగ్రవాదులను పెంచి పోషించడం..  ఉగ్రవాదులతో ఇతర దేశాలలో మారణహోమాలు సృష్టించడం పైన ఎక్కువగా దృష్టి పెట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ లో పాలకులు మారినా ఎక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు అని చెప్పాలి. ప్రస్తుతం ఒక్క అంతర్జాతీయ కంపెనీ కూడా పాకిస్థాన్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో.

 ఈ క్రమంలోనే ఏ దేశం కూడా పాకిస్థాన్లో పెట్టుబడులకు ముందుకు రాకపోవడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకు పోతుంది. ప్రస్తుతం కనీసం ఆ దేశంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో కి వెళ్ళిపోతుంది పాకిస్థాన్ ప్రభుత్వం. ప్రభుత్వ  కార్యాలయాలను అద్దెకు ఇచ్చి వచ్చిన డబ్బులతో జీతాలు చెల్లిస్తున్న  దుస్థితి కనిపిస్తోంది. ఇక ఇంత జరుగుతున్నా అటు పాకిస్థాన్ ప్రభుత్వం తీరు లో మాత్రం మార్పు రావడంలేదు. అయితే పాకిస్తాన్లో రోజురోజుకు మారుతున్న పరిస్థితులను చూసి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది.

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వం ఆసక్తికర స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్లీజ్ మా దేశానికి రండి అంటూ ఇతర దేశాలను వేడుకోవడం మొదలుపెట్టింది. ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి సంక్షోభంలో  కూరుకుపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎఫ్ఏటీఎఫ్  నిబంధనల కారణంగా ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు కూడా  దొరకని పరిస్థితి. దీంతో తమ దేశంలో పెట్టుబడి పెట్టె విదేశీయులకు శాశ్వత నివాసం పౌరసత్వం కల్పిస్తామంటూ పాకిస్తాన్ చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త జాతీయ భద్రత పాలసీ తీసుకువచ్చినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. చైనా ఆఫ్ఘనిస్తాన్ అమెరికా దేశాలకు పెట్టుబడులు పెట్టేందుకుఆహ్వానం పంపింది పాకిస్తాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: