ఎన్ఆర్ఐ లకు శుభవార్త... గ్రీన్ కార్డు లు పొందడం ఇక సులభం!

VAMSI
సంవత్సరాల తరబడి అమెరికాలో ఉంటూ ఇప్పటికీ గ్రీన్ కార్డ్ లేని వారికి ఆనందాన్ని కలిగించే వార్త ఇది అని చెప్పవచ్చు. ఎంతో కష్టపడి పెద్ద చదువులకని సొంత దేశాన్ని వదిలి అమెరికాకు తరలి వెళ్ళారు. చదువైపోయింది అక్కడే ఉద్యోగాన్ని సంపాదించి సంతోషంగా బ్రతుకుతున్నారు. కానీ అమెరికా సిటిజెన్ అన్న పేరు మాత్రం ఇప్పటికీ దకక్క పోవడం కాస్త విచారాన్ని కలిగించే అంశమే. అందుకోసం జ్యుడిషియరీ కమిటీ ఒక మంచి ఆలోచనతో ఒక బిల్లును తీసుకు వచ్చింది. ఎవరైతే ఇప్పటి వరకు గ్రీన్ కార్డును పొందలేదో వారందరూ సూపర్ ఫీ ను చెల్లిస్తే...గ్రీన్ కార్డు ను పొందడానికి గల అన్ని నియమాలను చెక్ చేసి వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీరిలో ఇప్పటికే ఎందరో అప్లై చేసి ఉన్నారు.
అలాంటి వారందరూ ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే సదరు బిల్లును రెండు సభల లోనూ అందరి ఆమోదం కోసం ప్రవేశ పెడుతారు. తల్లితండ్రులతో పాటుగా వచ్చి ఇక్కడ నివాసముంటున్న 21 సంవత్సరాలు నిండిన వారు ఈ సూపర్ ఫీ కట్టడానికి అర్హులని తెలుస్తోంది. ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని నమ్మకంతో అధికార పార్టీ ఉంది. మామూలుగా అమెరికా పౌరసత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం కేవలం 1.40 లక్షల  గ్రీన్ కార్డులు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో ఇక్కడ నివసిస్తున్న దేశాలు అన్నింటిలో ప్రతి ఒక్క దేశానికి 7 శాతం కంటే మించి గ్రీన్ కార్డులు ఇవ్వడం కుదరదు. ఈ విధంగా చూసుకుంటే అన్ని దేశాల కన్నా ఒక్క ఇండియా వారు మాత్రమే గ్రీన్ కార్డ్ పొందని వారిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంకా 7.41 లక్షల భారతీయులు గ్రీన్ కార్డ్ పొందాల్సి ఉంది.  అయితే అమెరికా నిబందల ప్రకారం వీరికి గ్రీన్ కార్డ్ రావాలంటే ఇంకా 84 ఏళ్ళు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టనున్న బిల్లు ప్రకారం ఈ సూపర్ ఫీ 5,000 డాలర్లు గా చెల్లించాలి. దీని ద్వారా  ఎక్కువ సంవత్సరాలు గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేసే వారు ఈ పద్దతి ద్వారా త్వరగా పొందే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గమే అని విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. మరి ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: