అఫ్ఘాన్‌లో బిక్కుబిక్కుమంటున్న వందలాది ఎన్నారైలు..?

Suma Kallamadi
తాలిబన్ల దురాక్రమణ తరువాత అఫ్ఘానిస్థాన్‌లో చోటు చేసుకుంటున్న సంఘటనలు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాలిబన్లు అత్యంత ప్రమాదకరమైన తుపాకీలతో వీధుల్లో తిరుగుతుంటే అక్కడి ప్రజలు ప్రజలను బెంబేలెత్తిపోతున్నారు. రాక్షస పాలనలో మగ్గిపోవడం కంటే.. ఎంత కష్టమైనా దేశం విడిచి వెళ్లి పోవడమే శ్రేయస్కరమని అఫ్ఘాన్‌ ప్రజలు భావిస్తున్నారు. అత్యంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కాబుల్ ఎయిర్‌పోర్టుకు సైతం పోటెత్తుతున్నారు. వారు బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాలిబన్లు ఎటాక్ చేస్తున్నారు. అక్కడి స్థానికులు సైతం టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఘోరమైన పరిస్థితులకు దారి తీస్తున్నారు. ఇక తాలిబన్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో  విమానాశ్రయం వద్ద భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్తనాదాలు, ఆక్రందనలు మధ్య మన ఇండియా పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం మొత్తం 450 మంది దాకా ఎన్నారైలు అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నారని సమాచారం.


అయితే వారందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు, ముఖ్యంగా ఇతర దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే అఫ్ఘాన్‌ దేశం నుంచి భారతీయ రాయబార కార్యాలయం సిబ్బంది అధికారులను ఇండియా కి తరలించారు. అయితే ఇంకా అక్కడే చిక్కుకుపోయిన సామాన్య భారతీయులను కాంటాక్ట్ కావడానికి  ‘స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌’ అనే ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి ఉపశమనం కల్పిస్తున్నారు. ఈ విభాగానికి వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా అఫ్ఘాన్‌ దేశంలో భారతీయులు మొత్తం 450 మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇదిలా ఉండగా రాజధానిలోని గురుద్వారా నగరంలో ఉండిపోయిన హిందువులు, సిక్కుల ప్రాణాలకు ఎటువంటి హాని తలపెట్టమని తాలిబన్లు స్పష్టం చేశారు. త్వరలోనే భారతీయులందరినీ సురక్షితంగా తమ ఇళ్లకు చేరవేసే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు తాలిబన్ల రాజ్యం నుంచి బయటపడ్డారు. వారంతా కూడా విమానాశ్రయం వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించగా.. మిగతా ఎన్నారై కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: