న్యూయార్క్ వీధికి భారతీయుడి పేరు?

Suma Kallamadi
అగ్రరాజ్యంలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కుతోంది. భారత్ మూలాలు ఉన్న కమలా హరీస్ అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలు అయిన తర్వాత ఉన్నత అధికారాలు అన్నీ కూడా ఎక్కువగా భారత మూలాలను అధ్యక్షులు దక్కుతున్నాయి. నిజానికి మన భారతీయుల లోని ప్రతిభను అమెరికన్లు గుర్తించి వారికి శాసించే అధికారాన్ని ప్రసాదిస్తున్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థ, వైద్య వ్యవస్థలలో మన భారతీయులే ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో అమెరికా దేశాన్ని శ్వేత జాతీయులకు ధీటుగా శాసించే స్థాయికి భారతీయులు వెళ్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన భారతీయ పద్ధతులను సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు. మన దేశంపై మిక్కిలి ప్రేమ పెంచుకుంటున్నారు. దీనితో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది. అయితే తాజాగా మరొక భారతీయుడి పట్ల అమెరికన్లు తమ ప్రేమను చాటుకున్నారు.
ప్రముఖ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్, మత నాయకుడు అయిన పండిట్ రామ్‌లాల్ తన వ్యక్తిత్వంతో, అమోఘమైన సేవలతో అమెరికా ప్రజలను ఫిదా చేశారు. జూన్ నెలలో న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ రిచ్‌మండ్ హిల్‌లో ఆయన పేరును ఒక వీధికి పెట్టాలని నిర్ణయించారు అంటే అతిశయోక్తి కాదు. న్యూయార్క్ నగర కౌన్సిల్ వుమన్ అడ్రియన్ ఆడమ్స్ రామ్‌లాల్ పేరు ఒక వీధికి పేరుగా మార్చాలని ప్రతిపాదించారు. అయితే ఆమె ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న న్యూయార్క్ మేయర్ బిల్.డి. బ్లాసియో వెంటనే సంతకం చేసి వీధికి పండిట్ రామ్‌లాల్ పేరు పెట్టుకోవచ్చని ఆమోదం తెలిపారు. దీనితో తాజాగా  ఒక వీధికి ఆయన పేరును పెడుతూ సైన్ బోర్డు ఆవిష్కరించారు.
గయానా స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న రామ్‌లాల్ 1979లో అమెరికాకు వలస వచ్చారు. అనంతరం బ్రూక్లిన్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసిన ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా అవతారం ఎత్తి ఆసుపత్రిలో కార్మికులను ఏర్పాటు చేశారు. న్యూయార్క్‌లోని రాజకీయ నాయకులు, ఇండో-కరేబియన్ లోని సంఘ నాయకులలో ఆయనకు మంచి పేరుంది. అతను గయానాలోని రీజియన్ సిక్స్ లోని స్కెల్డన్ నుండి అమెరికాకు వచ్చారు. కొంతకాలం తర్వాత ఆయన ఇండియాకి చేరుకొని ఒక ఇండియన్ యూనివర్సిటీ లో చేరి హిందీ నేర్చుకున్నారు. అనంతరం హిందీ పాఠాలు బోధించారు. ఆర్య సమాజం ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆర్యసమాజ మందిరాలను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన 2019 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు. కాగా ఆయన జ్ఞాపకార్థం అమెరికా ప్రజలు ఒక వీధికి ఆయన పేరు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: