ఇండియన్స్‌కి తీపి కబురు అందించిన అమెరికా..?

Suma Kallamadi
అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే విద్యార్థులకు గత కొద్ది రోజులుగా వీసాలు మంజూరు చేయడంలో అమెరికా ప్రభుత్వం వ్యతిరేకత చూపుతోంది. కానీ ఎట్టకేలకు అమెరికా రాయబార కాన్సులర్‌ వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో అమెరికా లోని విశ్వవిద్యాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఇంకా వీసా అందక ఆందోళన చెందుతున్నారు.
ఈ సమయంలోనే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్‌ అఫైర్స్ కౌన్సిలర్ మినిస్టర్ డాన్‌ హెఫ్లిన్‌ వీసా ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తీపి కబురు అందించారు. యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లు.. వేల మంది భారతీయ విద్యార్థుల కోసం ఇంటర్వ్యూ స్లాట్స్ ఓపెన్ చేయనుంది. అయితే విద్యార్థులు యూఎస్ ఎంబసీ వెబ్సైట్ సందర్శించి వారి అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది.
"అమెరికా ప్రభుత్వం విద్యార్థుల వీసాలకు ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సెమిస్టర్ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాలు సులభతరం చేసేందుకు మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. జూన్ 14, 2021 తేదీన జూలై, ఆగస్టు విద్యార్థుల వీసా ప్రక్రియ ప్రారంభించనున్నాము. ఎఫ్1, జె1, ఎమ్1 వీసాలు పొందాలనుకునే భారతీయ విద్యార్థులు మా వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవాలి. వారి కోర్సెస్ ప్రారంభం అవ్వకముందే.. అనగా 30 రోజులు ముందుగా విద్యార్థులు అమెరికాకు వెళ్లొచ్చు" అని డాన్‌ హెఫ్లిన్‌ వెల్లడించారు. అయితే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు గానీ మరే ఇతర బంధువులకు గానీ వీసాలు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా లేమని.. వారు ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకోవద్దని ఆయన సూచించారు.
ఇకపోతే ప్రయాణాలకు మూడు రోజుల ముందుగా భారతీయ విద్యార్థులు కొవిడ్-19 నిర్ధారణ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్థులను అమెరికా ప్రయాణానికి అనుమతించరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: