ఎన్నారైలతో కేటిఆర్ కీలక భేటీ...?

Gullapally Venkatesh
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగానే ఉంది. కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది అనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవారి విషయంలో ఎన్నారైలు చాలా తక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నది. అయినా ఎన్నారైలు ముందుకు రావటం లేదు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చాలా అనుకూలంగా ఉన్నా సరే కొంతమంది వెనక్కు తగ్గడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు భూముల ధరలు కూడా పెరుగుతున్నా చాలామంది రియల్ ఎస్టేట్ రంగం వైపు ఆసక్తి చూపించకపోవడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
విదేశాల్లో స్థిరపడిన వారు గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు. కానీ తెలంగాణకు ఈ సమస్య తీవ్రంగా ఉందని రాజకీయ వర్గాలు సమాచారం. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత మంత్రి కేటిఆర్ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ తో పాటు అమెరికాలో కూడా కొంత మంది ఎన్నారైలతో ఆయన సమావేశం నిర్వహిస్తారు అని అంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్నారైలతో కూడా ఆయన సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలను సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకుని మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో వాళ్లతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని కీలక మార్పులు చేయవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: