అమెరికాలో ఆ రాష్ట్రం భారత ఎన్నారై అడ్డా..మామూలు రికార్డ్ కాదుగా..!!

VIKRAM
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులు వివిధ రంగాలలో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం విధితమే. రాజకీయాల్లో సైతం మనోళ్ళు పాతుకుపోయారని , గత ఎన్నికల్లో కంటే కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయులు తమ సత్తా చాటారని సగర్వంగా చెప్పుకోవచ్చు.  అత్యంత కీలకమైన పదవులలో మన భారతీయ ఎన్నారైలు నియమింపబడటం, స్థానికంగా అక్కడి ప్రజల మన్ననలు అందుకోవడం మామూలు విషయం కాదు. అయితే ఎన్నో అవరోధాలు, అధిగమించిన ఓ ప్రవాస భారతీయులు ఇప్పుడు అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేశాడు.

అతడి పేరు నీరజ్ అంటానీ. అమెరికాలోని ఒహియో రాష్టానికి ఎన్నికైన మొట్టమొదటి ఇండో అమెరికన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అంటానీ 2014 లో ఒహియో 42 వ జిల్లాకు ప్రతినిధిగా వ్యవహరించారు. సామాజిక సేవా దృక్పధం కలిగిన అంటానీ ముందు నుంచీ ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో స్థానికంగా ఎంతోమందికి సుపరిచయం అయ్యారు.  ఈ క్రమంలోనే అతడు రాజకీయాలవైపు ఆకర్షితుడు కావడంతో రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఒహియో రాష్ట్రానికి సెనేటర్ గా ఎన్నికయ్యారు.

అంటానీ విజయంతో స్థానికంగా ఉండే భారతీయులు, భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒహియోలో తన గెలుపును సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంటానీ తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి సెనేటర్ గా సేవలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాయని తెలిపారు. ఒహియో ప్రజల కలలు సాకారం అవ్వడానికి తాను నిత్యం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు. ఇదిలాఉంటే అమెరికా చరిత్రలో ఏనాడూ లేనంతగా మొన్న జరిగిన అధ్యక్ష్య ఎన్నికల్లో ఇండో అమెరికన్స్ ఎంతో మంది పోటీ చేశారని, అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని,భవిష్యత్తులో మరింత మంది  ఇండో అమెరికన్స్  రాజకీయంగా ఎదగడానికి తాజా పరిణామాలు స్పూర్తినిస్తాయని అంటున్నాయి ఇండో అమెరికన్ సంఘాలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: