ఉలిక్కి పడ్డ భారతీయులు అందుకోసం 195 ఏళ్ళు ఆగాల్సిందే...!!!

VIKRAM

అగ్ర రాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం అవసరమైన గ్రీన్ కార్డ్  భారతీయులకి దక్కాలంటే 195 ఏళ్ళు వేచి చూడాల్సిందే అంటున్నారు అధికార పార్టీకి చెందిన సెనేటర్ మైక్ లీ. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఎన్నో లక్షలమంది భారతీయులు గ్రీన్ కార్డ్ పొందేందుకు కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో రిపబ్లికన్ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంతో గ్రీన్ కార్డ్ పై భారతీయుల ఆశలు కలలుగానే మిగిలిపోనున్నాయని మరో సారి స్పష్టం అవుతోంది. అయితే

భారతీయులు ఈ పరిస్థితుల నుంచీ బయటపడాలంటే చట్టబద్దమైన పరిష్కారంతో ముందుకు వెళ్లాలని అందుకు సహచర సెనేటర్లు సహకరించాలని కోరారు మైక్. ప్రస్తుతం గ్రీన్ కార్డ్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయని వీటిని మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ నుంచీ ఎవరైనా బ్యాక్ లాగ్ లో చేరితే వారికి ఈబీ -3 గ్రీన్ కార్డ్ రావడానికి 195 ఏళ్ళు పడుతుందని తెలిపారు. సెనేటర్ డిక్ డర్బిన్ ప్రవేశ పెట్టిన బ్యాక్ లాగ్ లో చిక్కుకున్న వారి ప్రయోజనాలు రక్షించాలనే తీర్మాన్నాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా మైక్ స్పందించారు.

ఏ వలసదారుడు అయినా మృతి చెందితే వారు ఆర్జీ పెట్టుకున్న గ్రీన్ కార్డ్ నిరాకరించడంతో అతడి కుటుంభం మొత్తం గ్రీన్ కార్డ్ ఫలాలని పొందలేక పోతోందని మైక్ ప్రకటించారు. వలస దారులు అమెరికాలో శాశ్వతంగా ఉండాలంటే గ్రీన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని కానీ కొన్ని మార్పులు చేయకపోతే ఎంతోమంది వలసదారులు నష్టపోతారని అన్నారు. ఇదిలాఉంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయుల సంఖ్య లెక్కకి మించి ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా అనే సందేహాలు ట్రంప్ వీసాల విషయంలో గ్రీన్ కార్డ్ జారీ విషయంలో విధిస్తున్న నిభంధనల వలన ఆందోళన కారంగా మారిందని అంటున్నారు భారతీయ నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: