ఉప్పలపాటి అధ్యక్షతన టాంటెక్స్‌ నూతన కార్యవర్గం...!!

Shyam Rao

తెలుగు సంస్కృతి, తెలుగు భాష కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 2017 సంవత్సరానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఇర్వింగ్లో జరిగిన గవర్నింగ్‌ బోర్డు సమావేశంలో టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాంటెక్స్‌ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్‌ లాంటి సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.



ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే టాంటెక్స్‌ అధ్యక్షడిగా పదవీ విరమణ చేసిన జొన్నల గడ్డ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలోని కార్యవర్గ బృందానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: