విజయవంతంగా సిలికానాంధ్ర మనబడి మహాసదస్సు..!

Edari Rama Krishna
అమెరికాలో తెలుగు వారు నిర్వహించే కార్యక్రమాలు ఎన్నో విజయవంతం అవుతున్న నేపథ్యంలో..సిలికాన్‌ వ్యాలీలో జరిగిన 3 రోజుల మహాసదస్సులో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అమెరికా దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్‌, సౌది అరేబియా దేశాలలోని దాదాపు 500 మంది భాషా సైనికులు ఇందులో పాల్గొన్నారు. వీరు అందరూ కలిసి అక్కడ తొలిరోజున శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని సందర్శించి అచ్చ తెలుగు వంటకాలతో వనభోజనాలు చేశారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మన బడి విద్యార్థులు ప్రదర్శన వీక్షకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.

ముఖ్యంగా మహాభారతంలోని శ్రీ కృష్ణ రాయబారం నాటకానికి స్పందనగా ప్రాంగణంలోని వారందరూ లేచి చెప్పట్లు కొట్టారు. గుమ్మడి గోపాల కృష్ణ దర్శకత్వంలో ఈ నాటకంలోని పాత్రధారులంతా ఒకరికొకరు పోటాపోటీగా అత్యంత క్లిష్టమైన సమాసాలతో కూడిన సంభాషణలను పద్యాలను చాలా చక్కగా పాడి అక్కడి వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: