మెగాస్టారే అల్లు అర్జున్ ను జైలుకెళ్లకుండా కాపాడారా.. చక్రం అలా తిప్పారా?
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ సహా మెగా కుటుంబం కూడా బన్నీని ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ గ్యాప్ లోనే అల్లు అర్జున్ 14 రోజులు బయటకి రాడు! అంటూ షాకింగ్ వార్తలు మీడియాలో రాగా అల్లు అర్జున్ విషయం జనాలను మరింత టెన్షన్ పెట్టింది. కాగా ఎట్టకేలకి అల్లు అర్జున్‌కి ఈరోజే మధ్యంతర బెయిల్ రాగా అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే బయటకు వచ్చేసాడు. అయితే ఇంత తక్కువ సమయంలోనే ఈ సీరియస్ కేసులో అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించిన హీరోపై అల్లు అర్జున్ సహా మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా అల్లు అర్జున్ బయటకు రావడానికి కారణం మరెవరో కాదట! టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఇతడే అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడని అంటున్నారు. విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ కేసుని కోర్ట్‌లో చాలా చాకచక్యంగా వాదించి సాయంత్రానికి బెయిలు వచ్చేలా చేశారట. ఇతని విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తాను మెగాస్టార్ చిరంజీవికి ఎంతో దగ్గర స్నేహితుడు అట. మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" సినిమా చేసింది కూడా ఈయనే. ఇలా మెగాస్టార్ వెనకుండి చొరవ తీసుకోవడంతోనే ఇంత త్వరగా అల్లు అర్జున్ బయటకి వచ్చేలా సెట్ చేశాడని ఇపుడు సినీ వర్గాల్లో టాక్ మొదలైంది.