అల్లు అర్జున్ అరెస్టు అంతా రేవంత్ రెడ్డి మీదికే వెళుతుంది.. వ్యక్తిగత కక్షతోనే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని అరెస్టు చేయించారనే వాదన వినిపిస్తోంది.. టికెట్ రేట్లు పెంచి పుష్ప-2 సినిమాకి సహాయం చేస్తే అల్లు అర్జున్ మాత్రం సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు పలకకపోవడంతో రేవంత్ రెడ్డి కాస్త గుస్సా అయ్యి ఆయన మీద పగతోనే రేవతి మృతి ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేసేలా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు తాను అందులో జోక్యం చేసుకోలేదని,నాకు ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటూ రేవంత్ రెడ్డి ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతేకాదు ఒక సాధారణ మహిళ చనిపోయింది ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆమెకు అండగా నిలుస్తుంది.
ప్రభుత్వం తరఫున కేసు పెడుతుంది. ఆయన సినిమాలు తీసి సంపద పెంచుకున్నారు. ఆయన ఏమైనా పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర యుద్ధం చేసే సైనికుడా అంటూ అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇదే ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చిరంజీవి మా వాడే అంటూ చెప్పిన మాటలు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య కొత్త చిచ్చు పెట్టాయి. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి కాంగ్రెస్ వాడే అంటే మా వాడే. బన్నీ భార్య స్నేహ రెడ్డి తండ్రికి మాకు దగ్గరి బంధుత్వం ఉంది. స్నేహ రెడ్డి వాళ్లు మా బంధువులు.. అలాగే అల్లు అర్జున్ మామ, చిరంజీవి ఇద్దరు కాంగ్రెస్ వాళ్లే..
కానీ బంధుత్వాలు,పార్టీలు అనేవి చూడం..చట్టం ముందు అందరూ సమానులే అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.అయితే చిరంజీవి కాంగ్రెస్ ని వదిలేసి చాలా రోజులు అయింది. ప్రస్తుతం ఆయన టిడిపి కూటమిలో భాగమయ్యారు.అయితే ఆయన భాగం కాకపోయినప్పటికీ ఆయన సొంత సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీ కూటమిలో కలిశారు. కాబట్టి ఆయనకి బిజెపి పార్టీతో కూడా సంబంధం ఉంది.అయితే బీజేపీ పార్టీతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవిని సడన్ గా రేవంత్ రెడ్డి మా వాడే కాంగ్రెస్ వాడే అంటూ మాట్లాడడం కాంగ్రెస్ బిజెపి మధ్య రేవంత్ రెడ్డి కొత్త చిచ్చు పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి