అల్లు అర్జున్ : నెక్స్ట్ అడుగుకు కష్టాలు.. అయోమయంలో ఫ్యాన్స్..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా .. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ఈ సినిమాకు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన హోల్డ్ ను కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇకపోతే అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక పుష్ప పార్ట్ 2 తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు ... మళ్లీ ఆ మూవీ తో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని కొడతాడు అని ఆయన అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతలోనే ఆయన అభిమానులకు కాస్త నిరాశ ఎదురయింది. ఎందుకు అంటే పుష్ప పార్ట్ 2 ప్రీమియర్స్ ను డిసెంబర్ 4 వ తేదీన ప్రదర్శించగా ఆ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు.

దానితో అక్కడికి భారీగా జనాలు రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. దానితో అల్లు అర్జున్ ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఇలా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన అభిమానులు కాస్త కంగారుపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: