అల్లు అర్జున్ అరెస్ట్.. రంగంలోకి జగన్ ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ చీఫ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా స్పందించారు. టాలీవుడ్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ను తీవ్రంగా ఖండించిన ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ చీఫ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి... రేవంత్ రెడ్డి సర్కార్‌ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు.

అయితే.. సంఘటన వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని వెల్లడించారు వైసీపీ పార్టీ చీఫ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. అదే సమయంలో దీనిపై హీరో అల్లు అర్జున్‌  తన విచారాన్ని వ్యక్తం చేశాడని గుర్తు చేశారు జగన్‌.  ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని టాలీవుడ్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ను ప్రశంసించారు. కానీ రేవతి ఘటనకు నేరుగా అల్లు అర్జున్‌ బాధితుడు కాదనన్నారు. బన్నీని అరెస్ఠ్‌ చేయడం ఎంతవరకు సమంజసం?  అంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు జగన్‌.
తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదని విరుచుకుపడ్డారు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్‌ చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ చీఫ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇది ఇలా ఉండగా...  అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్..నెలకొంది.
నా భార్య చనిపోవడానికి అల్లు అర్జున్ కు సంబంధం లేదంటూ బాంబ్‌ పేల్చారు రేవతి భర్త భాస్కర్‌. అన్యాయంగా  అల్లు అర్జున్ అరెస్ట్‌ చేసినట్లు నిప్పులు చెరిగారు రేవతి భర్త భాస్కర్‌. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని తెలియదని.... నేను కేసు విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించారు భాస్కర్. ఇక అటు అల్లు అర్జున్‌ కు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: