షాక్: అల్లు అర్జున్ కు జైలు శిక్ష ఎన్నేళ్లు అంటే..?

Divya
పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూడాలని ఉద్దేశంతో సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.. దీంతో అల్లు అర్జున్ అభిమానిగా పేరుపొందిన రేవతి, ఆమె కుమారుడు సినిమా చూడడానికి థియేటర్ వద్దకు రాగా.. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో  రేవతి మహిళ మృతి చెందడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. రేవతి కొడుకు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందిస్తూ ఈ సంఘటన జరగడం తనకు చాలా దురదృష్టకరమని.. తమ కుటుంబానికి సహాయంగా ఉంటానని తెలిపారు.

వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందిస్తానని అలాగే తన టీం నుంచి ఇంకా ఎలాంటి సహాయం కావాలన్న తమ కుటుంబానికి అందించడానికి సిద్ధంగానే ఉన్నామంటూ తెలిపారు.. అయితే తాజాగా ఇటీవలే కొన్ని నిమిషాల క్రితం అల్లు అర్జున్ ని పోలీసులు సైతం అరెస్టు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది ట్రాన్స్ఫోర్స్ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి మరి పోలీస్ స్టేషన్ కి రావాలని అడిగారట. దీంతో అల్లు అర్జున్ వెంటనే వారికి సహకరించి వారితోపాటు వెళ్లిపోయారు.

అయితే అల్లు అర్జున్ పైన నమోదైన కేసులో విషయానికి వస్తే.. సెక్షన్ 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ కింద నాట్ బెయిలబుల్ కేస్ ని నమోదు చేసినట్లు సమాచారం.. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం అల్లుఅర్జున్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఒకవేళ ఈ కేసు రుజువు అయితే అల్లు అర్జున్ కి సుమారుగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుందనే విధంగా పలువురు న్యాయం నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్య థియేటర్ ఓనర్ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: