సలార్, కల్కి సినిమాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు ప్రభాస్. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు.పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న పాన్ ఆసియా సినిమా “స్పిరిట్” కూడా ఒకటి. మరి దీనిపై భారీ అంచనాలు సెట్ చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు.అయితే ఇపుడు ప్రభాస్ ఉన్న ఈ అంత బిజీలో కూడా సందీప్ ఈ సినిమాని తాను అనుకున్నట్టుగానే ఏడాది చివరిలోనే స్టార్ట్ చేసేయనున్నాడట. దీనితో డిసెంబర్ లోనే సినిమా స్టార్ట్ అవుతుంది అని ఇపుడు తెలుస్తుంది. సినిమా లాంచ్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట మరి ఆల్రెడీ మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యినట్టు తెలిసిందే. మరి ఈ లాంచ్ పై అధికారిక అప్డేట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.తాజాగా స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందో సినాప్సిస్ రూపంలో హింట్ ఇచ్చి ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచారు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ప్రభాస్.. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే పలుమార్లు సందీప్ చెప్పారు.అయితే ఇప్పుడు సినాప్సిస్ ప్రకారం.. ఎల్లప్పుడూ న్యాయం నిలబెట్టేందుకు ప్రయత్నించే నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ విధి నిర్వహణలో ఓసారి అవమానానికి గురవుతారు. దీంతో తన గౌరవాన్ని తిరిగి దక్కించుకునేందుకు గ్లోబల్ క్రైమ్ సిండికేట్ ను వేటాడుతారు. చివరకు ఏం జరిగిందనే నేపథ్యంలో స్పిరిట్ ఉండబోతుందట.కాగా.. ఆ సిండికేట్ పాపులర్ సౌత్ కొరియా యాక్టర్ డాన్ లీ అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గతంతో ఈ చిత్రం గురించి సందీప్ వంగా మాట్లాడుతూ మొదటి రోజే ఈ మూవీ 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టనుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రభాస్ ఈ మూవీలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారన్నారు.