తెలుగులో రష్మిక ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? ఈ ఆ స్టార్ ఫ్యాన్స్ ని పట్టగలమా..!

Thota Jaya Madhuri
రష్మిక మందన్నా.. ఈ పేరు చెప్తే చాలు కుర్రాళ్లు హార్ట్ గిల గిల కొట్టేసుకుంటుంది. ఎంతలా అంటే షర్ట్ విప్పేసి మరి అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తున్నారు . రష్మిక ..రష్మిక అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్నారు . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.  రీసెంట్గా పుష్ప2 సినిమాతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . ఎంతలా అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా రష్మిక మందన్నా కు మరో  10ఏళ్ళు ఇండస్ట్రీలో ఢోకానే లేదు అంటూ తేల్చేస్తున్నారు .


దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతూ హాట్ టాపిక్ గా  ట్రెండ్ అవుతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బోలెడు విషయాలు బయటపెట్టింది . అంతేకాదు విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నించగానే చాలా స్మైలింగ్ తో ఆన్సర్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ గురించి ఓ రేంజ్ లో పొగిడేసింది . ఆల్రెడీ విజయ్ దేవరకొండకు ఆమెకు మధ్య రిలేషన్ ఉంది అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . ఇదే మూమెంట్లో విజయ్ దేవరకొండ నే  నా ఫేవరెట్ హీరో అని చెప్పడం ఇంకా హాట్ టాపిక్ గా మారిపోయింది.


"నా కెరియర్ కు అతను సపోర్ట్ ఎక్కువగా ఉంది .. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో ఆయన వాయిస్ ఓవర్ విని  చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. అది నాకు తెలుసు.  ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఈ ప్రేమను మరింత పొందేందుకు నేను కష్టపడతాను "అని కూడా చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. రష్మిక చాలా మంది స్టార్స్ పక్కన నటించింది. కానీ విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ అంటూ చెప్పడం అందరికీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ  కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కానీ రష్మిక చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉంది . విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ బిజీగానే ముందుకు వెళ్ళిపోతున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: