ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ..నాగబాబుకి రాజ్యసభ పదవి.. ఈ వార్తలు వినిపించినప్పటి నుండి నాగబాబు పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హార్ట్ టాపిక్ అవుతున్నారు.అయితే అలాంటి నాగబాబు ఎవడో నాకు తెలియదు అంటూ బాలకృష్ణ తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ ట్వీట్ పెట్టారు .మరి ఇంతకీ టిడిపి జనసేన కలిసిపోయిన వేళ పవన్ కళ్యాణ్ తో ఎన్నోసభల్లో పాలుపంచుకున్న బాలకృష్ణకి నాగబాబు తెలియకపోవడం ఏంటి అని చాలామంది ఈ విషయం తెలిసి నోరెళ్ళబెడుతున్నారు. మరి బాలకృష్ణ నాగబాబు ఎవడో నాకు తెలియదు అని అనడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
బాలకృష్ణ ఎవడో నాకు తెలియదు అని అనడానికి గల కారణం గతంలో నాగబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ గురించి మాట్లాడండి అని నాగబాబుకి ప్రశ్న ఎదురవగా.. బాలయ్య ఎవరు పాత సినిమాల్లో చేసే నటుడా.. నేరం శిక్ష అనే మూవీలో చేసిన పెద్ద యాక్టరా అంటూ నాగబాబు బాలకృష్ణ అంటే తెలియనివాడిలా ఫేస్ పెట్టాడు. అంతే కాదు ఆ ఇంటర్వ్యూలో మరోసారి బాలకృష్ణ గురించి ప్రశ్న ఎదురవగా.. నాకు బాలకృష్ణ ఎవరో తెలియదు అని సమాధానం చెప్పడంతో అప్పట్లో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే తాజాగా నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బాలకృష్ణ ట్విట్టర్లో షాకింగ్ ట్వీట్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అనే వీడియో పై "సారీ నాగబాబు ఎవడో నాకు తెల్వదు" అంటూ ఒక ట్వీట్ రాశారు. అయితే ఇది బాలకృష్ణ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చింది కాబట్టి ఇది బాలకృష్ణనే ట్వీట్ చేశారా.. లేక మరెవరైనా ట్వీట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ట్వీట్ ప్రస్తుతం మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.