రాజీకొచ్చిన మంచు మనోజ్.. ఏకంగా లక్ష బాండ్ సమర్పణ..!

Divya
రెండు మూడు రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా జ్వాలలు రగిలిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలే ఇందుకు ప్రధాన కారణం అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ గొడవల్లో భాగంగా మోహన్ బాబు హై బీపీ తో స్పృహ తప్పి పడిపోగా.. ఆయనను కాంటినెంటల్ హాస్పత్రికి తరలించారు మంచు విష్ణు. అంతేకాదు కాంటినెంటల్ హాస్పిటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంచు విష్ణు సాయంత్రం 5:30 గంటల వరకు మంచు మనోజ్ కి డెడ్ లైన్ విధించారు.

ఇక దిగివచ్చిన మంచు మనోజ్ రాచకొండ పోలీసులను ని కలిసి.. ఇకపై తనంతట తానుగా గొడవలకు దిగనని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించనని లక్ష రూపాయల బాండ్ సమర్పించారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడడానికి కూడా తాను సిద్ధమేనని గొడవలపై తాను రాజీకి  వస్తానని కూడా తెలిపారు మంచు మనోజ్. మొత్తానికైతే అన్నదమ్ముల గొడవలు ఇంటి వరకే పరిమితం కావాలి కానీ ఇక్కడ రోడ్డుపైకి రావడంతో ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇక మరోవైపు ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో సహా బయటపెడతానని మంచు మనోజ్ కామెంట్లు చేశారు. మరొకవైపు మంచు విష్ణు పెట్టిన డెడ్ లైన్ కి దిగివచ్చిన మంచు మనోజ్ ,ప్రెస్ మీట్ ను కాస్త క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా మంచు ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే మరోవైపు మంచు మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. మరోవైపు జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు.  ప్రస్తుతం ఈయనపై కేసు ఫైల్ అవ్వగా దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: