నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. “డాకు మహారాజ్” అంటూ చేసిన ఈ మాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ని కూడా బాలయ్య ఆల్రెడీ పూర్తి చేసేసుకునట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” రాబోతుంది. మరి దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై కూడా భారీ హైప్ ఉండగా బాలయ్య అలా డాకు మహారాజ్ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 లోకి దిగిపోయినట్టు తెలుస్తుంది.దీనితో వెంటనే అఖండ 2 పనులని తాను స్టార్ట్ చేసేసారు అని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ`కు సీక్వెల్ గా `అఖండ-2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈసారి వెండి తెరపై బాలయ్య ని నెక్స్ట్ లెవ్ లో చూపిస్తారు అనే అంచనాలున్నాయి. బాలయ్య నుంచి తెరపై ఆవిష్కరించడంలో బోయపాటి స్పెషలిస్ట్ అని తెలుసు. కానీ ఈసారి అంతకు మించి అంచనాలతో వస్తోన్న సినిమా కావడంతో బోయపాటి అందుకు తగ్గట్టే ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు.బాలయ్య అఖండ-2 షూటింగ్ కి వెళ్తున్నారనే వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ రివీల్ చేసింది. దీంతో ఆ విషయం షూటింగ్ ప్రారంభమైందని చెప్పబోతున్నారా? లేక న్యూ ఇయర్, క్రిస్మస్ కానుకగా ఏదైనా స్పెషల్ ప్లాన్ రివీల్ చేస్తున్నారా? అన్న సందేహం వ్యక్తమవుతుంది.ఇక డాకు మాహారాజ్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అసలే గాడ్ ఆఫ్ మాసెస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు విజయాలు నమోదయ్యాయి. దీంతో డబుల్ హ్యాట్రిక్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.