మరి కొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి.. ఊహించని చిక్కుల్లో అమల..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవరకు తెచ్చుకుందే..!?

Thota Jaya Madhuri
అమల పేరు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ ట్ర్లింగ్ ఎదురుకుంటుంది. ఎప్పుడు కూడా తన పని తాను చూసుకో పోయే అమల..సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది . ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . కాగా ఈ మధ్యకాలంలో అమల పేరుని  కొందరు ఆకతాయిలు దారుణతి దారుణంగా ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేశారు . దానికి కారణం నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి . నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ళ డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలుసు .


నాగార్జున కూడా అఫీషియల్ గా ప్రకటించారు . ఇప్పటికే పసుపు దంచే ఫంక్షన్ అదే విధంగా హాల్ది వేడుకలు కూడా కంప్లీట్ అయ్యాయి . కాగా అమల ఎక్కడా కూడా నాగచైతన్య పెళ్లికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అంతే కాదు ఎక్కడ ఇంట్రెస్ట్ గా పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అయిన పిక్చర్స్ కూడా బయటకు రాలేదు.  అయితే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న పిక్చర్స్ ని మాత్రం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు నిశ్చితార్ధం జరిగింది అన్న విషయాన్ని అనౌన్స్ చేసింది .


అక్కడే అమల పెద్ద చిక్కుల్లో ఇరుక్కునేసింది . నీ కొడుకుని ఒకలా సవతి తల్లి కొడుకుని ఒకలా చూస్తున్నావా..? అంటూ దారుణంగా ఏకేసారు  జనాలు . అంతేకాదు అమలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బూతు కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . దీంతో అమల ట్రోలింగ్ బాధలు భరించలేక సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వాలి అని నిర్ణయించుకుందట. అక్కినేని కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అమల ఎవరైతే జనాలు తనని ఇబ్బందికరంగా ట్రోల్ చేస్తున్నారో..? వాళ్ళందరి స్క్రీన్ షాట్స్ ను సైబర్ క్రైమ్ కు ఇవ్వబోతుందట . మరికొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి పెట్టుకున్న కూడా అమల ఈ విషయంలో ఎక్కడ తగ్గడం లేదట . నాగార్జున కూడా ఈ విషయంలో బాగా సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అక్కినేని నాగార్జున భార్య అమల పేరు బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: