ఆ హీరోయిన్ బ్రేకప్ కి కారణం తమన్నానేనా.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి.?

Pandrala Sravanthi
ఏంటి ఎంతో క్యూట్ గా కనిపించే తమన్నా వేరే వాళ్ళ జీవితాల్లో వేలు కూడా పడుతుందా.. ఇంతకీ తమన్నా ఎవరి జీవితంలో చిచ్చు పెట్టింది.. తమన్నా వల్ల ఎవరికి బ్రేకప్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. తమన్నా ప్రస్తుతం అయితే విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. కానీ గతంలో అయితే చాలామందితో ఎఫైర్ వార్తలు వినిపించాయి.అలా కోలీవుడ్ నటుడు కార్తీతో పెళ్లి వరకు వెళ్లినప్పటికీ కార్తి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆయనతో బ్రేకప్ చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.అలాగే తెలుగులో ఉండే కొంతమంది హీరోలతో కూడా తమన్నాకి రిలేషన్ వార్తలు,డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఫైనల్ గా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఉన్న ప్రేమని మాత్రం అఫీషియల్ గా బయట పెట్టింది.వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.
అయితే తెర ముందు వినిపించినవి ఇవైతే తెర వెనుక మరో టాక్ కూడా వినిపించింది. అదేంటంటే.. నయనతార ప్రభుదేవా ల ప్రేమ బ్రేకప్ అవ్వడానికి కారణం తమన్నానే అంటూ అప్పట్లో కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.అయితే ప్రభుదేవా తనతో వర్క్ చేసిన సిమ్రాన్, నగ్మా వంటి హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించినప్పటికీ అవి నిజం కాలేదు.కానీ నయనతారతో మాత్రం ఆయన పబ్లిక్ గానే తిరిగారు. ఇక నయనతార తో గొడవలు వచ్చి తమన్నాతో ప్రభుదేవా తిరుగుతున్నట్టు మీడియా లో వార్తలు వినిపించాయి.
ఈ వార్తలు నిజమే అన్నట్లుగా ప్రభుదేవా చేసిన అభినేత్రి సినిమాలో తమన్నాని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక అప్పట్లో తమన్నా ప్రభుదేవా ఇద్దరు పెళ్లికూడా చేసుకుంటున్నారని రూమర్లు వినిపించాయి. ఇక వీరిద్దరూ సినిమా కోసం పెళ్లి చేసుకున్నట్టు నటించిన ఫోటోలను పెట్టి వీళ్ళు నిజంగానే పెళ్లి కూడా చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వార్తలు రాశారు. కానీ ఈ వార్తలన్నీ కొద్ది రోజులకు ఆగిపోయాయి.ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే తమన్నా కూడా విజయ్ వర్మతో హ్యాపీగా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: