"ఆ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు".. స్టేజిపైనే ఇచ్చిపడేసిన బన్నీ..!
ఈ మూవీ మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతూ ఉండడం తో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఈ సినిమా కోసం బన్ని అదే విధంగా రష్మిక మందన్నా.. చాలా చాలా కష్టపడుతూ.. ప్రతి స్టేట్లోనూ ప్రమోషన్స్ చక్కగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించారు . అదేవిధంగా పాట్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు . కేరళలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు . ముంబైలో తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ సూపర్ సక్సెస్ అయింది . చాలా చాలా హుందాగా మాట్లాడుతూ బన్నీ తనపై ఉన్న క్రేజ్ రెట్టింపు చేసుకునేలా మాట్లాడాడు .
అయితే ఇక్కడే ఈ సినిమాలో అమ్మవారి గెటప్ లో కనిపించిన బన్నీకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేశారు రిపోర్టర్. బన్నీ కూడా చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. "ఇన్నేళ్ళ తన కెరియర్ లో ఎప్పుడు కూడా అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తాను అని అనుకోలేదు అని.. మీరు తెరపై చూసినంత ఈజీగా అమ్మవారి గెటప్ సెట్ అవ్వలేదు అని .. దానికోసం ఎన్నో రాత్రులు కష్టపడ్డామని.. సుకుమార్ నేను కష్టపడిన దానికి తగ్గ ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని" చెప్పుకొచ్చారు .
"అందరిలా నేను ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాను.. ఇంత కష్టపడ్డాను అని చెప్పుకోవడానికి ఇష్టపడనని.. నాకు అలాంటివి బయటికి చెప్పడం అంతగా నచ్చదు అని.. సినిమా కోసం మేము కష్టపడ్డ తీరు మాకు తెలుసు అని ..సినిమా కోసం ఎంత కష్టపడ్డామో అన్నది మాకు మాత్రమే తెలుసు అని.. రిజల్ట్ కొసం వెయిటింగ్ "అంటూ అక్కడ ఉండే రిపోర్టర్స్ కు షాక్ ఇచ్చాడు . నిజంగానే బన్నీ గేట్. ఏ హీరో కూడా అలా చీర కట్టుకోవడానికి ఇష్టపడరు. ఇంట్రెస్ట్ చూపించరు . కానీ బన్ని అందరిలోకి డిఫరెంట్ . అందుకే చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో విజృంభించేశాడు. ఈ సినిమాకి అసలు కర్త - కర్మ - క్రియ మొత్తం కూడా ఆ జాతర ఎపిసోడ్ అంటూ కూడా ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది . అసలు ఆ జాతర సీన్స్ లో అంత హైలెట్ అయ్యే విషయాలు ఏమున్నాయో ..? సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది..!