పుష్ప2 లేడీ గెటప్ వెనుక ఇంత జరిగిందా.. అన్నిసార్లు ఫెయిల్ అయ్యారా?

Reddy P Rajasekhar
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. ఈ సినిమాకు జాతర ఎపిసోడ్ హైలెట్ కానున్న సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఆ సినిమా గురించి, పాత్ర గురించి బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
పుష్ప ది రూల్ మూవీలో లేడీ గెటప్ అనేది సుకుమార్ ఐడియా అని బన్నీ అన్నారు. ఈ గెటప్ వెనుక కథ ఉందని ఆయన పేర్కొన్నారు. పుష్ప ది రూల్ కోసం పుష్పను ముందుగా ఒక రిచ్ లుక్ లో సఫారీ సూట్ లో షూట్ చేశామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోషూట్ కూడా పూర్తైందని ఆయన చెప్పుకొచ్చారు. లుక్ రిలీజ్ చేయడమే ఆలస్యం అనుకునే సమయంలో ఆ లుక్ ను సుకుమార్ వద్దన్నాడని బన్నీ తెలిపారు.
 
సుకుమార్ తనకు నచ్చలేదని ఇంకా ఏదో కావాలని అన్నారని ప్రేక్షకులకు ఏదైనా షాక్ ఇద్దామని చెప్పారని బన్నీ పేర్కొన్నారు. అప్పుడే సుకుమార్ కు లేడీ గెటప్ గుర్తుకొచ్చిందని ఆ ఐడియా వినగానే నేను షాక్ అయ్యానని బన్నీ కామెంట్లు చేశారు. పుష్ప2 లో లేడీ గెటప్ కోసం చాలా కష్టపడ్డానని ఒక దశలో ఆ గెటప్ వర్కౌట్ కాదేమో అని అనిపించిందని బన్నీ పేర్కొన్నారు.
 
సినిమాలో లేడీ గెటప్ ఎలా ఉంటుందనే విషయాన్ని సుకుమార్ నాకు వివరించాడని బన్నీ తెలిపారు. అక్కడ్నుంచి ఆ గెటప్ పై వర్క్ చేశామని చెప్పుకొచ్చారు. 2, 3 ఫోటోషూట్స్ చేసి ప్రతి సందర్భంలో ఫెయిల్ అయ్యామని తృప్తి లేదని మా మీద మాకే డౌట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మూడోసారి ఫోటోషూట్ చేసిన సమయంలో మాత్రం అనుకున్నది సాధించామని బన్నీ తెలిపారు.
 
లేడీ గెటప్ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ స్థాయి ఏంటో అర్థమైందని ఆయన పేర్కొన్నారు. ఈ లేడీ గెటప్ సినిమాకు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. పుష్ప2 రిజల్ట్ కోసం ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: