ఏంటి ఏఎన్ఆర్ అలాంటివారా ...క్యాన్సర్ వచ్చి చనిపోయే స్టేజిలో ఉన్నా కూడా నర్స్ తో రొమాన్స్ చేశారా.. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని ఫ్యామిలీకి రొమాంటిక్ హీరోస్ అనే ట్యాగ్ ఉంది.ఎందుకంటే ఏఎన్ఆర్ ఎలా అయితే హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటూ వారిపై పంచులు వేస్తూ వారిని అట్రాక్ట్ చేసేవాడో ఆ తర్వాత నాగార్జున కూడా అలానే పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు అయితే నాగార్జునని ఓ మన్మధుడని .. గ్రీకువీరుడని పిలుచుకుంటారు. అలా నాగార్జునకి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.ఇక ఏఎన్ఆర్ కి అంతకంటే ఎక్కువగా ఉండేది కానీ ఇప్పటి జనరేషన్ కి ఏఎన్ఆర్ గురించి అంతగా తెలియదు.అయితే వీరిద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటే చెప్పడం చాలా కష్టం.
కానీ ఏఎన్ఆర్ మనవడు సుమంత్ చాలా ఈజీగా చెప్పేశారు. రీసెంట్గా ఆయన ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో మామయ్య,తాతయ్య ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అని అడగగా.. చెప్పాలంటే కాస్త కష్టమే.. ఏ మాట కామాటే తాతయ్యనే కాస్త ఎక్కువ రొమాంటిక్.. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోయే స్టేజ్ లో ఉన్నా కూడా ఆయనకి ట్రీట్మెంట్ చేసే నర్సులతో చిలిపివేశాలు వేసేవాడు.ఆ సమయంలో నేను ఆయనని చూసి షాక్ అయ్యేవాడిని.
చనిపోయే స్టేజ్ లో ఉన్నా కూడా తాతయ్య సరసం ఆడడం మాత్రం మానడం లేదు అని అనుకునేవాడిని. ఇక తాతయ్యని చూసుకోవడానికి ఇద్దరు లేడీ నర్సులు ఉండేవారు. వారితో ఆయన చిలిపి మాటలు మాట్లాడుతూ సరసం ఆడుతూ ఉండేవారు. ఇక ఆయన మాటలకు ఆయన చనిపోతున్నారనే బాధలో నుండి బయటపడి ఆ క్షణం ఎంతో నవ్వుకునేవాడిని అంటూ హీరో సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ విషయం బయట పెట్టారు