దేవరకి జరిగింది పుష్పకి జరిగేనా.. అలా జరిగితే టాలీవుడ్ పంట పండినట్టే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ అనేక విషయాలలో కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" మూవీ తో క్రియేట్ చేసిన కొత్త రికార్డులు చాలా కాలం పాటు ఉండే అవకాశాలు కనబడడం లేదు. ఎందుకు అంటే మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.

దానితో ఇప్పటికే ఈ సినిమా కొన్ని విషయాలలో దేవర పార్ట్ 1 మూవీ క్రియేట్ చేసిన రికార్డులను క్రాస్ చేస్తూ వెళ్తుంది. ఇంకా ఈ సినిమా విడుదల తర్వాత దేవర క్రియేట్ చేసిన మరికొన్ని రికార్డులను కూడా ఈ మూవీ క్రాస్ చేసే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి పుష్ప పార్ట్ 2 మూవీ కనుక కొత్త రికార్డులను క్రియేట్ చేసినట్లయితే ఆ రికార్డులను ఏ మూవీ క్రాస్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: