మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టంగా తినే కూర ఇదే.. రోజూ ఆ ఐటమ్ పక్కగా ఉండాల్సిందేనట?

praveen
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 70 ఏళ్ల వయసులోనూ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. కుర్రాళ్లలా మంచి ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే, యంగ్ హీరోలతో ఫిట్‌నెస్, సినిమా రంగాల్లో పోటీపడుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి అభిమానులకు తెలియని కొన్ని వ్యక్తిగత వివరాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆయనకు ఇష్టమైన ఆహారం గురించి. నిజానికి చిరంజీవి ఒక ఫుడ్ లవర్. అయితే, తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆయన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ఆహారం అంటే ఆయనకు చాలా ఇష్టమే అయినప్పటికీ, ఎక్కువగా తినరు. కానీ, ఆయనకు ఇష్టమైన వంటకం మెనూలో ఉంటే ఆ రోజు కొంచెం ఎక్కువగా తింటారు. ఆయనకు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక సినిమా ఈవెంట్‌లో యాంకర్ సుమ ఆయనను ప్రశ్నించారు.
సుమ చిరంజీవిని ఉద్దేశించి “మీకు నాటుకోడి ఇష్టమా లేక చేపల పులుసు ఇష్టమా?” అని క్వశ్చన్ చేసింది. దీనికి చిరంజీవి రెండూ ఇష్టమే అని చెప్పారు. కానీ ఒకటి వంటకం పేరు చెప్పాలని సుమ పట్టు పట్టడంతో చేపల పులుసు అంటేనే చాలా ఇష్టమని స్పష్టం చేశారు. తన తల్లి అంజన దేవి చేసే చేపల పులుసు తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. చిరంజీవి ఎన్నోసార్లు తన తల్లి చేసే చేపల కూర, చేపల పులుసు గురించి చెప్పారు. ఒకసారి తాను స్వయంగా చేప ఫ్రై కూడా చేశానని చెప్పారు. అయితే చిరుకి ఇష్టం వంటకుమో తెలుసుకోవడంతో అభిమానులు రచ్చ చేస్తున్నారు మనలాగే అని చిరంజీవికి కూడా చేపల పులుసు అంటే ఇష్టమా అని మరి కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అంతేకాకుండా, ఆయన డ్యాన్స్ ప్రతిభకు గుర్తుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. 45 ఏళ్ల కెరీర్‌లో 156 సినిమాల్లో 24,000 కంటే ఎక్కువ డాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవిని గుర్తించారు. ఈ అద్భుతమైన విజయంతో చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమలో ఒక లెజెండ్ గా పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: