ఆర్జీవీ లొంగిపోతే బెటర్.. లేకపోతే జరిగేది ఇదే.. !
వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ అండ చూసుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేనపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు. అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ పై ఇష్టం వచ్చినట్టు విరుచుకుపడ్డారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి.. గతంలో చంద్రబాబు, టీడీపీ, లోకేష్, పవన్ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసిన నేతలపై కేసులు పెట్టడం.. నోటీసులు ఇవ్వడం.. అరెస్టులు చేయటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వర్మకు నోటీసులు ఇవ్వగా.. వర్మ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు రాలేదు. వర్మ దాదాపు.. పరారీలో ఉన్నాడు. ఏరోజు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి.
తాజాగా సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను భయపడడం లేదని వర్మ చెపుతున్నా లోపల మాత్రం వర్మకు భయం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పోలీసులు ట్రాప్ ఆర్జీవి గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటున్నారు.. తాను పరారీలో లేనని చెబుతున్నారు. ఆయన ఎదురుగా ఉన్న ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు న్యాయపరమైన.. ఉన్న అవకాశాలను ముగించాలని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ ట్రాప్‌లో ఆర్జీవి ఇరుకుపోయారు. తనను అరెస్టు చేసి కొడతారని ఆర్జీవి భయపడుతున్నారా.. ఆయనను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు లేదా ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఉంటుంది.
తనను ఓ జోకర్ గా చూడాలని.. జోకులేసానని.. సెటైర్లు వేశానని వర్మ చెప్పుకుంటున్నారు. కానీ.. ఎలా చూడాలో చట్టం కోణం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయవద్దని విజయ్‌బాబు వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందన చూస్తే.. ఆర్జీవికి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాదని అర్థమయింది. ఏది ఏమైనా వర్మకు తాను చేసిన తప్పేమిటో తెలుసు. రెండు, మూడు టీవీ ఛానల్స్‌ని పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో.. లేక తనను అరెస్టు చేసి కొడతారని జాతీయ మీడియా ఛానళ్ళకు చెబితే పోలీసులు వెనక్కి తగ్గుతారే అనుకుంటున్నారో కానీ.. రోజురోజుకు వర్మ బాగా మతిస్థిమితం కోల్పోతున్నారు.