20 ఏళ్లకే తల్లి.. రెండు పెళ్లిళ్లు.. రెండు సార్లు విడాకులు.. !

RAMAKRISHNA S.S.
సినిమా రంగంలో ఎంతో మంది హీరోయిన్లు చిన్న వయసులోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం.. మళ్ళీ ప్రేమలో పడటం.. చివరకు పిల్లల పుట్టి 20 ఏళ్లు వచ్చాక కూడా భర్తలకు విడాకులు ఇవ్వడం చూస్తున్నాం. ఇలా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ 20 ఏళ్లకే తల్లి అయింది. జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుని.. రెండుసార్లు విడాకులు తీసుకుంది. ప్ర‌స్తుతం బుల్లితెరపై సత్తా చాటుతోంది. ఆమె శ్వేతా తివారి. తెలుగుతో పాటు.. హిందీ, తమిళం, కన్నడ భాషలలో చాలామంది బుల్లితెర హీరోయిన్లతో పోలిస్తే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సీరియల్ కసాటి జిందగీ కె సీరియల్ ద్వారా నార్త్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇందులో ఆమె ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది ఈ హీరోయిన్. ఇక శ్వేతా తివారి.. సినీ రంగుల జీవితం ఎంతో విజయవంతంగా కొనసాగినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె రెండుసార్లు ప్రేమలో పడి.. రెండుసార్లు మోసపోయింది.

శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాలక్‌ తివారి అనే పాప జన్మించింది. మనస్పర్ధలతో 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రియాన్స్ కోహ్లీ జన్మించాడు. కానీ కొద్ది రోజులకే తన భర్త గృహ హింస‌కు పాల్పడుతున్నాడని.. 2019లో కోర్టును ఆశ్రయించి. అదే ఏడాది విడాకులు తీసుకుంది శ్వేతా తివారి. కొన్ని నివేదికల ప్రకారం శ్వేతా తివారి ఆస్తులు రూ.81 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ‌ చేస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె తన అందచందాలతో ఈ వయసులో కూడా అందరిని కవ్వించి రెచ్చగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: