ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ కి పుష్ప -2 నిర్మాతలకి మధ్య అస్సలు పడడం లేదని సుకుమార్, బన్నీలతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా కేరళలో జరిగిన పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో కూడా స్టేజ్ పై మాట్లాడిన దేవిశ్రీప్రసాద్ పుష్ప-2 నిర్మాతలపై అసహనం వ్యక్తం చేసి పరోక్షంగా చురకలు అంటించారు. అయితే బన్నీకి దేవిశ్రీప్రసాద్ సుకుమార్ ల బంధం ఆర్య సినిమా నుండి కొనసాగుతోంది. ఇప్పటివరకు బన్నీ చేసిన ఎన్నో హిట్ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు.అలా వీరి మద్య ఎంతోమంచి అనుబంధం ఉంది. కానీ పుష్ప టు సమయం లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అల్లు అర్జున్ దేవిశ్రీప్రసాద్ ల మధ్య బంధం చెడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప టు బిజిఎం కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తీసుకున్నారు.
అయితే బిజిఎం కావాలని ముందుగా నిర్మాతలు చెప్పలేదని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.అయితే దేవిశ్రీప్రసాద్ ని తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకుందామనే నిర్మాతలు అలా చేశారో లేక మరేదైనా కారణాలు ఉన్నాయో కానీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కి దేవిశ్రీప్రసాద్ కి మాత్రం బంధం చెడినట్టు తెలుస్తోంది.అయితే అంతేకాదు బన్నీ, దేవిశ్రీప్రసాద్ మధ్య బంధం చెడడానికి కారణం మరో హీరోనట.ఇక ఆ హీరో ఎవరయ్యా అంటే అక్కినేని నాగచైతన్య.. నాగచైతన్య,సాయి పల్లవి కాంబోలో తండేల్ సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి కూడా దేవిశ్రీ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
అయితే పుష్ప టు సినిమాలో బిజీగా ఉన్న సమయంలోనే నాగచైతన్య కూడా పిలిచి అర్జెంటుగా తమకి ఓ మ్యూజిక్ కావాలి అని ఇబ్బంది పెట్టారట. దాంతో దేవిశ్రీప్రసాద్ వెళ్లడం తప్పనిసరి అయిందట. ఇక తండేల్ మూవీ షూటింగ్ కోసం ఓ మ్యూజిక్ తయారు చేసే సమయంలోనే పుష్ప టు చిత్ర యూనిట్ కూడా మ్యూజిక్ కోసం ఇబ్బంది పెట్టడంతో ఇంత తక్కువ టైంలో చేయలేను అని దేవిశ్రీ చెప్పారట.దాంతో దేవిశ్రీని పక్కనపెట్టి తమన్ ని తీసుకున్నారు. అలా అల్లు అర్జున్,మైత్రి మూవీ మేకర్స్ కి దేవిశ్రీప్రసాద్ కి మధ్య చిచ్చు పెట్టింది అక్కినేని నాగచైతన్య అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు