ఊహించని చిక్కుల్లో లావణ్య త్రిపాఠి .. మెగా కోడలు ఇలా ఇరుక్కుపోయింది ఏంటి..?

Thota Jaya Madhuri
ఏ విషయం అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ఆచితూచి అడుగులు వేయాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.  బహుశా ఇప్పుడు లావణ్య త్రిపాఠికి అదే పెద్ద గుణపాఠంగా మారిపోయింది అంటున్నారు జనాలు . లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాకముందు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ .. స్టార్ హీరోయిన్ అని చెప్పలేం . ఒక హీరోయిన్ ..అందంగా ఉంటుంది. చక్కగా నటిస్తుంది . అంతే అంతకు మించిన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు.  అయితే ఎలాగోలా వరుణ్ తేజ్ తో ప్రేమాయణం ఫినిష్ చేసింది . పెళ్లి కూడా చేసేసుకుంది.  రీసెంట్ గానే వీళ్ళ పెళ్ళై ఏడాది కూడా కంప్లీట్ అయింది.  ఈ క్రమంలోనే వీళ్లిద్దరికి సంబంధించిన పలు రకాల రొమాంటిక్ పిక్చర్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు కి కమిట్ అయిందట లావణ్య త్రిపాఠి.


అది ఒక రొమాంటిక్ ప్రాజెక్ట్ . ఆ తర్వాత కొన్ని కారణాల చేత బడ్జెట్ ప్రాబ్లం కారణంగా ఈ ప్రాజెక్టును ఆపేసారట.  అయితే లావణ్య త్రిపాఠి ఆ సినిమాకి చేసిన అగ్రిమెంట్ ని మాత్రం క్యాన్సిల్ చేసుకోలేదట . ఎలాగో సినిమా క్యాన్సిల్ అయిపోయింది కదా అంటూ సైలెంట్ అయిపోయిందట . అయితే మెగా ఇంటికి కోడలు అయిన తర్వాత ఆ స్టేటస్ ఉపయోగించుకొని లావణ్యతో హిట్ కొట్టేలా చేయడానికి ఆ డైరెక్టర్ మరొకసారి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ ని లావణ్యకి పంపిస్తూ ..మీరు ఈ ప్రాజెక్టులో నటించాల్సిందే అంటూ మొండిగా మాట్లాడుతున్నారట .


అయితే లావణ్య త్రిపాఠి ది ఏ మాత్రం తప్పులేదు. అప్పుడు ఆ ప్రాజెక్టుకు కమిట్ అయింది .. ఆ తర్వాత మేకర్స్ ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారు . కానీ ఎందుకు ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకొస్తున్నారు . కావాలనే మెగా ఫ్యామిలీని మెగా ఇంటి పరువును  ట్రోల్ చేయడానికి ఇలా చేస్తున్నారా..? అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . అయితే లావణ్య త్రిపాఠి కూడా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉందట . అంతేకాదు అవసరమైతే ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదట.  ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వార్త పై అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ ఏ మాత్రం రెస్పాండ్ కావడం లేదు.  సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది . అయితే కొంతమంది ఇది కావాలని ఎవరో మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు సృష్టిస్తున్న రాద్ధాంతం అంటూ సినిమా ఇండస్ట్రిలో ఇలాంటివి కామన్ అంటూ కొట్టి పడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: